Raj Tarun : రాజ్ తరుణ్‌ను వెంటాడుతున్న ఆ భయం
ప్రతీ హీరోకు సినిమా ఎంత ముఖ్యమో దాని ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. ఒక్కొసారి ఎంత మంచి సినిమా ఐనా ప్రమోషన్స్ సరిగ్గా చేసుకోకపోతే పడ్డ కష్టం మొత్త వృధా అవుతుంది. అందుకే ఏది మిస్సైనా సినిమా ప్రమోషన్స్ మాత్రం మిస్ చేసుకోరు యాక్టర్స్. కానీ హీరో రాజ్ తరుణ్ మాత్రం రెండు సినిమాలు రిలీజ్‌కు ఉన్నా.. ఇల్లు వదిలి బయటకు రావడంలేదు.

Tollywood young hero Raj Tarun starrer Purushottamudu will be doing promotions.. Will Lavanya chase Tarun..?
ప్రతీ హీరోకు సినిమా ఎంత ముఖ్యమో దాని ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. ఒక్కొసారి ఎంత మంచి సినిమా ఐనా ప్రమోషన్స్ సరిగ్గా చేసుకోకపోతే పడ్డ కష్టం మొత్త వృధా అవుతుంది. అందుకే ఏది మిస్సైనా సినిమా ప్రమోషన్స్ మాత్రం మిస్ చేసుకోరు యాక్టర్స్. కానీ హీరో రాజ్ తరుణ్ మాత్రం రెండు సినిమాలు రిలీజ్‌కు ఉన్నా.. ఇల్లు వదిలి బయటకు రావడంలేదు. రాజ్ తరుణ్ హీరోగా తిరబడరా సామి, భలే ఉన్నాడే అనే రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కానీ మూవీ టీం, హీరో రాజ్ తరుణ్ మాత్రం ప్రమోషన్స్ ఎక్కడా నిర్వహించడంలేదు. రీసెంట్‌గా రాజ్ జీవితం ఎలాంటి మలుపులు తిరగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మాజీ ప్రియురాలు లావణ్య రోడ్డెక్కడంతో రాజ్ జీవితం తుఫానులా తయారయ్యింది. ఆ కేసులో ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ బయటకు వస్తున్నకొద్దీ రాజ్ తరుణ్ కెమెరాకు కనుమరుగయ్యాడు. మొదటి రోజు మాత్రం మీడియాతో మాట్లాడిన రాజ్ తరుణ్.. ఆ తరువాత అసలు కెమెరా ముందుకే రాలేదు. పర్సనల్ లైఫ్‌లో తనకు తగిలిన దెబ్బతో సినిమా ప్రమోషన్స్‌కు కూడా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ సినిమా ప్రమోషన్స్‌కు బయటికి వచ్చినా.. ఖచ్చితంగా లావణ్య ఇష్యూ గురించి మాట్లాడక తప్పదు. సినిమా ప్రమోషన్స్ లేకున్నా పర్లేదు కానీ ఈ ఇష్యూ ఏం మాట్లాడొద్దు అని రాజ్ తరుణ్ బలంగా ఫిక్స్ ఐనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రమోషన్స్ కూడా పక్కన పెట్టి ఇంకా సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోయాడు రాజ్. లావణ్య ఇష్యూలో రాజ్ తరుణ్‌కు పట్టుకున్న ఆ భయం.. సినిమా ప్రమోషన్స్‌కు కూడా దూరం చేసింది.