TOLLYWOOD: పెళ్లిళ్ల నామ సంవత్సరం.. టాలీవుడ్‌లో ఈ ఏడాది పెళ్లి చేసుకోబోయేదెవరు..?
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఇంకా పెళ్లి కాని ప్రసాదుల్లాగే ఉన్నారు. వీళ్ల పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, అడివి శేష్, అల్లు శిరీష్, అఖిల్, రామ్ వంటి హీరోలు ఈ జాబితాలో ఉన్నారు.
TOLLYWOOD: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మధ్య ఉంది స్నేహం కాదు, ప్రేమే అన్న గట్టినమ్మకం జనాల్లో పెరిగింది. అన్‌స్టాపబుల్ షోలో రణ్‌బీర్, రష్మిక మాటల వల్లో.. లేదంటే మరో కారణం వల్లో కాని జనాలకు క్లారిటీ వచ్చింది. కాకపోతే ఈ ఇద్దరి పెళ్లెప్పుడనేదే తేలాలి. ఇప్పటికే విజయ్ దేవరకొండకు 34 ఏళ్లు నిండాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15కి పుష్ప 2 రాబోతోంది. మార్చ్‌లో విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ రానుంది.
Jr NTR: జపాన్ సునామీలో చిక్కుకున్న ఎన్టీఆర్..! ఆందోళనలో ఫ్యాన్స్..
హనురాఘవపూడి మేకింగ్‌లో రౌడీ స్టార్ మూవీ దసరాలోపు పూర్తవుతుంది. అంటే దీపావళికి కాస్త ముందు.. విజయ్, రష్మిక పెళ్లి కబురు వస్తుందా..? ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రభాస్ మీద ఎలాంటి గాసిప్ లేదు. కానీ, ఫార్టీ ఫోర్ ప్లస్ ఏజ్‌లో ఇంకా తను పెళ్లి చేసుకోకపోతే ఎలా అంటున్నారు. ఇక ఇదే తనకి డెడ్ ఎండ్ లాంటి ఇయర్ కాబట్టి.. తను ఈ ఏడాదే పక్కగా పెళ్లిచేసుకుంటాడనే అంచనాలున్నాయి. మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ 37 ఏళ్లతో ఏజ్ బార్ స్టేజ్‌లో ఉన్నాడు. అల్లు శిరీష్ 36 దాటేశాడు. స్కంద ఫేం రామ్ 35లోకి ఎంటరైతే, అడవి శేష్ ఏజ్ బార్ స్టేజ్‌లోకొచ్చాడు.
తమిళ హీరో విశాల్ అయితే ఎంగేజ్మెంట్ బ్రేక్ తర్వాత పెళ్లి జోలికెళ్లటం మర్చిపోయాడు. తనకి 46 ఏళ్లు నిండాయన్న సంగతే గుర్తులేకుండాపోయింది. నాగచైతన్య మ్యారేజ్ డ్యామేజ్ అవటంతో.. అఖిల్ పెళ్లి ఊసే ఎవరు ఎత్తట్లేదు. కానీ, ఈ పెళ్లి కాని ప్రసాదుల లిస్ట్‌లో విజయ్, అడవిశేష్, అల్లు శిరీష్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అఖిల్.. పెళ్లి కబుర్లు మాత్రం ఈ ఏడాదే వచ్చేలా ఉన్నాయి.