Devara : యంగ్‌టైగర్ దమ్ము చూపించనున్నాడా..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర.. ట్రిపుల్ ఆర్ (RRR) లాంటి పాన్ ఇండియా (Pan India) హిట్ తర్వాత జూనియర్ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2024 | 01:00 PMLast Updated on: Jun 03, 2024 | 1:00 PM

Tollywood Young Tiger Ntrs Latest Film Devara Is A Pan India Hit Like Triple R

 

 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర.. ట్రిపుల్ ఆర్ (RRR) లాంటి పాన్ ఇండియా (Pan India) హిట్ తర్వాత జూనియర్ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే కొరటాల శివ భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు. దేవర సినిమా ప్రతి అభిమాని కాలర్ ఎత్తుకునేలా చేస్తుందని స్వయంగా ఎన్టీఆర్ చెప్పడంతో.. ఈ మూవీపై అంచనాలు స్కైహైని తాకుతున్నాయి. కాగా.. పార్ట్-1 విడుదల కాకముందే.. పార్ట్‌-2 కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

దేవర (Devara) సినిమా సెట్స్ మీదకు వెళ్లిన కొన్నాళ్లకే రెండు పార్టులుగా తీద్దామని డిసైడ్ అయ్యాడు కొరటాల శివ.. దేవర రెండు పార్టులు అని అనౌన్స్ తీయగానే జూనియర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఇక.. ఈ మూవీ నుంచి రిలీజైన తారక్ లుక్, టీజర్, గ్లింప్స్ మూవీపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. అక్టోబర్ 10న దేవర రికార్డుల ఊచకోత కోసం ప్రతి అభిమాని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అయితే.. ఐతే దేవర మొదటి భాగం క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కి అదిరిపోయే లీడ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

దేవర 1 తో పాటుగా వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్.టి.ఆర్ (NTR) 2025 లో దేవర 2 కి డేట్స్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. 2025 దేవర 2 ని పూర్తి చేసి 2026 సంక్రాంతికి లేదా సమ్మర్ కి దేవర 2 ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.. అంతేకాదు.. అంతేకాదు దేవర 1 ఎండింగ్ కి దేవర 2 రిలీజ్ డేట్ చెప్పేస్తారని కూడా అంటున్నారు.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

RRR తర్వాత దేవర చేస్తున్న తారక్ గ్లోబల్ వైడ్ గా తనని అభిమానించే ప్రేక్షకులందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.. దేవర సినిమాతో దమ్ము చూపించేందుకు వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తాడని అంటున్నారు దేవర ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇక.. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిబీబిజీగా ఉన్నారు.. దేవర సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ ప్రారంభం కానుంది..