TOLLYWOOD: జనవరి నుంచి ఆగస్ట్ వరకు.. 2024 లో రాబోయే సినిమాల లిస్ట్ ఇదే..

జనవరి 13న సైంథవ్ మూవీతో వెంకీ, ఈగల్ సినిమాతో రవితేజ రావటం కూడా కన్ఫామ్ అయ్యింది. ఇక్కడ కూడా వాయిదా ప్రశ్నే తలెత్తలేదు. బిగ్ బాస్ ఫినాలేలో కూడా ఇదే విషయం రవితేజ ప్రమోషన్‌తో తేలింది. జనవరి 14న నా సామి రంగా రాబోతోందని నాగ్ కూడా తేల్చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 08:22 PMLast Updated on: Dec 18, 2023 | 8:22 PM

Tollywoods Upcoming Movie List Of 2024 Is Here

TOLLYWOOD: జనవరి నుంచి ఆగస్ట్ వరకు రాబోయే సినిమాల జాబితా ఫిక్స్ అయ్యింది. సింగర్ సునీత కొడుకు ఆకాశ్ హీరోగా చేసిన మూవీ.. సర్కారు నౌకరి లాంటి చిన్నమూవీతో 2024 ఏడాది కొత్త సినిమాల సందడి షురూ కానుంది. తర్వాత జనవరి 12 కి గుంటూరు కారం రాబోతోంది. దాంతో హనుమాన్ మూవీ పోటీకి దిగబోతోంది. ఎలాంటి వాయిదా సూచనలు లేవు. కాబట్టి జనవరి 12న గుంటూరు కారంతో హనుమాన్ సినిమా పోటీ కన్ఫామ్ అయ్యింది.

Rajinikanth: క్రేజీ కాంబో.. రజినీకాంత్ కోసం రంగంలోకి దిగనున్న రణ్‌వీర్‌ సింగ్..

ఇక జనవరి 13న సైంథవ్ మూవీతో వెంకీ, ఈగల్ సినిమాతో రవితేజ రావటం కూడా కన్ఫామ్ అయ్యింది. ఇక్కడ కూడా వాయిదా ప్రశ్నే తలెత్తలేదు. బిగ్ బాస్ ఫినాలేలో కూడా ఇదే విషయం రవితేజ ప్రమోషన్‌తో తేలింది. జనవరి 14న నా సామి రంగా రాబోతోందని నాగ్ కూడా తేల్చేశాడు. ఇక లాల్ సలామ్‌తో రజినీ, కెప్టెన్ మిల్లర్‌తో ధనుష్ జనవరి 14కే దండెత్తబోతున్నారు. ఇక్కడ కూడా రిలీజ్ డేట్లు లాకైపోయాయి. జనవరి 25న ప్రతినిధి సీక్వెల్ ప్రతినిధి 2, ఆ మరుసటి రోజు తమిళ్ హీరో విక్రమ్ మూవీ తంగలాన్ రాబోతున్నాయి. ఫిబ్రవరి 8కి యాత్ర 2 రాబోతోంది. టిల్లు స్క్వేర్ అంటూ డీజే టిల్లు సీక్వెల్‌ని ఫిబ్రవరి 9కి రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఫిబ్రవరి 16న ఆపరేషన్ వాలెంటైన్ వస్తుంటే, డబుల్ ఇస్మార్ట్ శంకర్ మార్చ్ 8కి రిలీజ్ కాబోతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితోపాటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా అదే రోజు రిలీజ్ కన్ఫామ్ చేసుకుంది.

ఆల్రెడీ నాని, నితిన్ కోసం డిసెంబర్ రిలీజ్‌ని త్యాగం చేసిన విశ్వక్ సేన్ మార్చ్‌లో మాత్రం రిలీజ్ డేట్ మార్చేది లేదనేశాడు. ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5కి రావటంలో ఎలాంటి జాప్యం జరగదట. గ్రాఫిక్స్ వర్క్‌ని ఆల్రెడీ మొదలు పెట్టారు. గ్రాఫిక్స్ అవసరమైన సీన్లు ముందే తీసేయటం వల్ల అక్కడ డిలే కాకుండా చూసుకుంటున్నారు. ఐతే మే 9న కల్కి రావటం మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. ఫిల్మ్ టీం ఎనౌన్స్‌మెంట్ ని సంక్రాంతికి ప్లాన్ చేసిందని తెలుస్తోంది. పుష్ప 2 మాత్రం ఆగస్ట్ 15 కి రిలీజ్ అవటం కన్ఫామ్ అయ్యింది. ప్రస్తుతానికి కొత్త ఏడాది సరికొత్త క్యాలెండర్‌ని సిద్దం చేసింది టాలీవుడ్.