Top story: సౌందర్య ఆస్తులు కలెక్షన్ కింగ్ కొట్టేశారా ? కుటుంబసభ్యులను బెదిరించి కబ్జా చేశారా ?
అందరి ముందు సుబ్బిని సుద్దపూసని అని బిల్డప్...మైక్ దొరికితే డిసిప్లీన్ గురించి ఊకదంపుడు ఉపున్యాసాలు...5వందల సినిమాలు అంటూ కోతలేకోతలు. సకలకళా వల్లబుడు అనేలా యాక్టింగ్. ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చానంటూ ఓవర్ యాక్షన్. ఇవన్నీ ఎవరికి గురించి అనుకుంటున్నారా ?
అందరి ముందు సుబ్బిని సుద్దపూసని అని బిల్డప్…మైక్ దొరికితే డిసిప్లీన్ గురించి ఊకదంపుడు ఉపున్యాసాలు…5వందల సినిమాలు అంటూ కోతలేకోతలు. సకలకళా వల్లబుడు అనేలా యాక్టింగ్. ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చానంటూ ఓవర్ యాక్షన్. ఇవన్నీ ఎవరికి గురించి అనుకుంటున్నారా ? ఆయనే కలెక్షన్ కింగ్, ఓవర్ యాక్షన్ నటుడు మోహన్ బాబు.
మంచు భక్తవత్సలం నాయుడు ఆలియస్ మంచు మోహన్ బాబు…సినిమా ఇండస్ట్రీలో తనకంటే గొప్ప నటుడు ఎవరు లేరనేలా జనం ముందు బిల్డప్ ఇవ్వడంలో ముందుంటాడు. డైలాగ్ ల్లో తన కంటే పర్ఫెక్షనిస్టు ఎవరున్నారని మహామహుల ముందు డైలాగ్ లు కొడతాడు. తన ముందు అందరూ జుజుపి అనేలా అధిగ ప్రసంగం చేస్తాడు. కష్టపడిపైకి వచ్చానంటాడు. ఎన్నో అవమానాలు పడ్డానంటాడు. ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కూడా ఉంది. అదే ఆస్తులను కొట్టేయడం…దాంట్లో పాగా వేయడంలో మనోడికి అందె వేసిన చేయి. పక్కోడి ఆస్తుల కొట్టేయడంలో మంచు మోహన్ బాబుకు ఎంత పెద్ద అవార్డయినా ఇవ్వొచ్చు. 5వందల సినిమాలు చేసిన మోహన్ బాబు…అందులో కొన్ని విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత హీరో అయ్యాడు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా సంపాదించిన సొమ్ముతో…లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశారు. 56 సినిమాలు సినిమాలు నిర్మిస్తే…అందులో 10 సినిమాలు మాత్రమే హిట్. మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సందడి చేయలేదు. కాసులు రాల్చలేదు. మరో నిర్మాత అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయి…ఏ హుసేన్ సాగర్ లో దూకేసేవాడు. కోట్లు పెట్టిన తీసిన సినిమాలన్నీ ప్లాపయినా…ఈ రేంజ్ ఎలా మెయింటెన్ చేస్తున్నాడనే ప్రశ్నలు రావొచ్చు. నీతి నిజాయితీలపై ఉపన్యాసాలు ఇచ్చే మోహన్ బాబు…ఇప్పటికీ ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే సందేహాలు…ఎంతో మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ మంచు మోహన్ బాబు కదా ఇక్కడ. పక్క వారి ఆస్తులు కొట్టేయడంలో మనోడు ఎక్స్ పర్ట్.
1990ల్లో టాప్ సౌందర్య టాప్ హీరోయిన్ గా వెలుగొందారు. ఆమె సినిమా చేస్తే హిట్టే…నిర్మాతలు ఆమె డేట్ల కోసం వెంట పడేవారు. అలాంటి సమయంలో మోహన్ బాబుతో శ్రీరాములయ్య, పెదరాయుడు, శివ్ శంకర్ వంటి సినిమాలు చేసింది సౌందర్య. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు సంపాదించిన డబ్బుతో శంషాబాద్ కు సమీపంలోని జల్ పల్లిలో 6 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ఆస్తులను కొనేటపుడు…వాటి వివరాలను మోహన్ బాబుకు చెప్పింది. కెరీర్ లో బిజీగా ఉండటంతో సంరక్షణ బాధ్యతలను చూసుకోవాలని చెప్పింది. అపుడే సౌందర్య ఆస్తులపై మోహన్ బాబు కన్నుపడింది. ఇలాంటి సమయంలోనే ఏప్రిల్ 17, 2004న విమాన ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ప్రాణాలు కోల్పోయారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాలపై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో బెంగలూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం కొన్నేళ్లు నడించింది. 2013 డిసెంబరు 3న రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
ఇంతలోనే సత్యహరిశ్చంద్రుడు అని చెప్పుకునే కలెక్షన్ కింగ్… జల్ పల్లిలో సౌందర్య భూములను కబ్జా చేసేశాడు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలిసినా…మోహన్ బాబును ఎదురించే ధైర్యం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. డాక్యుమెంట్లతో, ఆధారాలు లేకుండా మాయం చేసేశాడు. మరొకరు స్థలంలో అడుగు పెట్టకుండా అక్కడే భారీ భవంతిని నిర్మించుకొని…పాగా వేసేశాడు. తానే ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు. వాస్తవమేంటో చెప్పడానికి సౌందర్య లేదు. శంషాబాద్ లో ఉన్న భూమి విలువే…ప్రస్తుత మార్కెట్ ప్రకారం వెయ్యి కోట్లకుపైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో మోహన్ బాబుకు ఎదురే లేకుండా పోయింది. సౌందర్య ఆస్తులు మాత్రమే కాదు…లక్ష్మీపార్వతి, దాసరి నారాయణరావు ఆస్తులను కొట్టేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దాసరి నారాయణరావు కొడుకులకు ఆస్తుల పంచకుండా…తానే అనుభవిస్తున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ని దారుణాలు…అక్రమాలు…చేశాడు కాబట్టే…అందరూ ఆయన్ను మనిషివా…మోహన్ బాబువి అని కామెంట్లు చేస్తున్నారు.