Top story: బలి కోరిన పుష్ప…. ఆమె చావుకు కారణం ఎవరు?

కాలం మారిపోతుంది. ల్యాండ్ లైన్ రోజుల నుంచి ఇంటర్నెట్ ఫోన్లోకి వచ్చేసాం. టూరింగ్ టాకీస్ నుంచి ఓటీటీ లకు చేరుకున్నాం. డ్రెస్ కల్చర్ మారింది. చదువులు మారాయి. ఎన్ని మారుతున్న మన జనంలో మాత్రం సైకో ఫ్యాన్సీ పోవడం లేదు. సినిమా హీరోలన్నా, పొలిటికల్ లీడర్లన్న ఏదో పిచ్చ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2024 | 01:40 PMLast Updated on: Dec 06, 2024 | 1:40 PM

Top Story Who Is The Reason For Her Death

కాలం మారిపోతుంది. ల్యాండ్ లైన్ రోజుల నుంచి ఇంటర్నెట్ ఫోన్లోకి వచ్చేసాం. టూరింగ్ టాకీస్ నుంచి ఓటీటీ లకు చేరుకున్నాం. డ్రెస్ కల్చర్ మారింది. చదువులు మారాయి. ఎన్ని మారుతున్న మన జనంలో మాత్రం సైకో ఫ్యాన్సీ పోవడం లేదు. సినిమా హీరోలన్నా, పొలిటికల్ లీడర్లన్న ఏదో పిచ్చ. వల్లమాలిన అభిమానం. ఈ విషయంలో 60 లలో ఎలా ఉన్నామో 2024 లోను అలాగే ఉన్నాం. మన పిచ్చని, అభిమానాన్ని సినిమావాళ్లు క్యాష్ చేసుకుంటున్నా… మనం కళ్ళు తెరవం. పుష్ప విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట…. ఓ కుటుంబాన్ని అడ్రస్ లేకుండా చేసింది. పిల్లల్ని అనాధలు చేసింది, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా…. మీరంతా నా అల్లు ఆర్మీ అనే ఒక్క డైలాగ్ తో నిజంగానే జనానికి పిచ్చెక్కించే హీరో… తన సినిమా విడుదల సందర్భంగా థియేటర్కు వస్తున్నా డు అని తెలిసి ఒక ఫ్యామిలీ మొత్తం ఆ ఆజానుబాహుడ్ని, అరవింద కమల నేత్రుని చూడడానికి పోలోమంటూ తరలివచ్చింది. దిల్షుక్ నగర్ కి చెందిన రేవతి తన భర్త భాస్కర్, కూతురు సన్విత, కొడుకు శ్రీ తేజ తో కలిసి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి వచ్చింది. తన వెర్రి ఆర్మీ ని పలకరించడానికి అల్లు అర్జున్ పోలీసులకి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తగిన యంత్రాంగం లేకుండా నేరుగా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సంధ్య ధియేటర్ కి వచ్చేసాడు.

ఒకవైపు పుష్ప టికెట్ల కోసం ఎగబడుతున్న జనం, మరోవైపు అల్లు అర్జున్ ని చూడడానికి తరలివచ్చిన వేల మంది అభిమానులతో అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఆ తొక్కిసలాటలో రేవతి కుటుంబం చిక్కుకుంది. రేవతి ని, ఆమె కొడుకు శ్రీతేజను జనం తొక్కి పడేసారు. అల్లు అర్జున్ మాత్రం తన వెర్రి జనం ఆర్మీ ని చూసుకొని…. మురిసిపోతూ రూపాయి ఖర్చు లేకుండా ఎంతమందిని సంపాదించానో అని పరవశించిపోయాడు. సందడి చేసి వెళ్లిపోయాడు. తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే మరణించింది. ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీ తేజను… పోలీసులు జనంలో నుంచి బయటికి లాగి ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దుర్ఘటనలో చాలామంది గాయపడ్డారు. పోలీసు లాంటి లాటిఛార్జ్ చేశారు. అల్లు అర్జున్ గాని, ఆయన టీం గాని ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సంధ్య థియేటర్కు వచ్చి ఓవరాక్షన్ చేశారు.

బన్నీని చూడడానికి జనం విరగబడ్డారు. పోలీసులకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కుటుంబంలోని ఆడదిక్కుని కోల్పోయి ఇప్పుడా కూతురు, భర్త వెర్రి చూపులు చూస్తున్నారు. సినిమా పైత్యం, హీరోల పట్ల పిచ్చి అభిమానం ఇప్పుడు ఆ కుటుంబాన్ని అనాధలు చేసింది. ఆ పిల్లాడు బతుకుతాడో లేదో తెలియని పరిస్థితి. దీని అంతటికి కారణమైన అల్లు అర్జున్ ఇప్పుడు పార్టీలో మునిగిపోయాడు. మైత్రి మూవీస్ నిర్మాతలు ఏదో ఒక ట్రీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. అమ్మ ఎక్కడ నాన్న అని ఆ పిల్లలు ఇద్దరు ప్రశ్నిస్తే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు.? ఎర్రచందనం స్మగ్లర్ గా చేసే ఒక సినిమా హీరోని చూడ్డానికి ఒక కుటుంబం తరలి రావడం ఏంటి.? తొక్కేస లాటల్లో తల్లి చనిపోవడం, చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి? దీని అంతటికి కారణమైన అల్లు అర్జున్ ఆయన పిల్లలతో సంతోషంగానే ఉంటాడు. వేదికలెక్కి మీరంతా నా ఆర్మీ, మిమ్మల్ని చూసుకునే నేను గర్వపడు తుంటాను, మీరంటే నాకు పిచ్చ ఇలాంటి పంచ డైలాగ్ లు చెప్పి రెచ్చగొడుతూ ఉంటాడు.

రేవతి లాంటి వాళ్ళని చూసి చాలామంది వీళ్లకు తిక్క కుదిరింది , హీరోలను చూడ్డానికి ఎవడు వెళ్ళమన్నాడు? అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తప్పు అల్లు అర్జున్ దా… రేవతి కుటుంబాంధ అన్నది కాదు ఇప్పుడు ప్రశ్న. తల్లిని కోల్పోయిన ఆ కుటుంబానికి, ఇప్పుడు ఎవరు దిక్కు అన్నది ప్రశ్న.ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై, అతని టీం పై కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో ఇంతకు మించి ఇంకేం జరగదు. అల్లు అల్లు అర్జున్ ని, ఆ నిర్మాతల్ని, అల్లు అర్జున్ వెనుకున్న అల్లు అర్జున్ వెనుకున్న బ్యాండ్ మేళాన్ని ఎవర్ని అరెస్టు ఎవర్ని అరెస్టు చేయలేరు పోలీసులు. చేయరు కూడా. ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులోనూ ఎటువంటి చర్యలు తీసుకోరు. సినిమా హీరోలంటే ఎగబడి పోయే జనం ఉన్నంతవరకు, 3 వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని… జస్ట్ ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చి వెళ్లిపోయే హీరోలు ఉన్నంతకాలం ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి.