Oscars Award 2024 : ఆస్కార్ బరిలో మలయాళం 2018.. మరో దక్కేనా..?
సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్న 2018 ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది. భారత్ తరఫున ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్స్ లో 2018 సెలెక్ట్ అయింది. 2024 ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరపున '2018' సినిమాను పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.

Tovino Thomas Aparna Balamurali in lead roles Jude Anthony Joseph directed movie 2018 Malayalam movie 2018 nominated in Oscars for 2024
ఒకప్పుడు ఆస్కార్ మనకు అందని ద్రాక్ష.. ఇప్పుడు మాత్రం కాదు. లాస్ట్ ఇయర్ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో యావత్ దేశం సంబరాలు చేసుకుంది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల పై ఆసక్తి పెరిగింది. ఇండియా నుంచి ఏ సినిమా బరిలో దిగుతుంది? అన్న చర్చ జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని రివీల్ చేసింది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మల్లూవుడ్ మూవీ 2018 బరిలోకి దించుతున్నట్లు అనౌన్స్ చేసింది.
టోవినో థామస్, అపర్ణా బాలమురళీ లీడ్ రోల్స్ లో జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన మూవీ 2018. కేరళలో వచ్చిన వరదల ని హైలెట్ చేస్తూ ఇక్కడ మనుషులు తమ మనుషులను ఎలా రక్షించుకుంటారు. అనే పాయింట్ ని హైలెట్ చేశాడు. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయం సాధించింది. 10 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. మల్లూవుడ్ లో సూపర్ హిట్ అయిన తర్వాత వేరే భాషల్లో డబ్ అయ్యి అక్కడ కలెక్షన్స్ రాబట్టింది.
భారత్ తరఫున ఆస్కార్ రేసులో 2018 మూవీ..
సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్న 2018 ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది. భారత్ తరఫున ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్స్ లో 2018 సెలెక్ట్ అయింది. 2024 ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరపున ‘2018’ సినిమాను పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. 16 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ.. ది కేరళ స్టోరీ, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ,మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే, బలగం, వలవి, బాప్లియోక్, ఆగస్టు 16, 1947 సినిమాలను పరిశీలించి 2018 ను ఎంపిక చేసింది. లాస్ట్ ఇయర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఇండియన్ సినిమాలకు ఆస్కార్ మీద ఆశలు పెంచింది. ఇప్పుడు వాటిని నిజం చేసేందుకు 2018 బరిలోకి దిగుతుంది.