KGF Yash : కేజీఎఫ్ సిరీస్ లాగే టాక్సిక్

కన్నడ (Kannada) రాకింగ్ స్టార్ యష్‌ (Rocking Star) నటించిన కేజీఎఫ్ సిరీస్ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 12:00 PMLast Updated on: May 06, 2024 | 12:00 PM

Toxic Like Kgf Series

కన్నడ (Kannada) రాకింగ్ స్టార్ యష్‌ (Rocking Star) నటించిన కేజీఎఫ్ సిరీస్ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 2) ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో యష్‌ పాన్ ఇండియా లెవల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అందుకే.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. కేజీఎఫ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు యష్.

గ్యాంగ్‌స్టర్ (Gangster ) యాక్షన్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ సినిమా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ సినిమాను కూడా కేజీఎఫ్ సిరీస్ లాగే ప్లాన్ చేస్తున్నారట. టాక్సిక్ సినిమాకు సీక్వెల్‌కు కూడా ఉంటుందని, మేకర్స్ రెండు భాగాలుగా రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర కమిట్మెంట్స్ కారణంగా కరీనా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే.. టాక్సిక్‌ రెండు భాగాలుగా వస్తుందో లేదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.