హీరో సోహైల్ ఇంట్లో విషాదం..

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్, టాలీవుడ్ యాక్టర్, హీరో సోహైల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోహైల్ తల్లి కన్నుమూసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2024 | 06:36 PMLast Updated on: Sep 17, 2024 | 6:36 PM

Tragedy At Hero Sohails House

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్, టాలీవుడ్ యాక్టర్, హీరో సోహైల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోహైల్ తల్లి కన్నుమూసింది.
గత కొంతకాలంగా సొహైల్ తల్లి.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోహైల్‌ స్వస్థలం కరీంనగర్ జిల్లా. ఆయన తండ్రి పేరు సయ్యద్ సలీం, తల్లి పేరు ఫైమా సుల్తానా. తమ్ముడు సయ్యద్ నబీల్. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోహైల్ తల్లి ఫైమా సుల్తానా.. డయాలసిస్ కోసం మెడికవర్ హాస్పిటల్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

ఆసుపత్రిలోనే ఆమె పరిస్థితి విషమించడంతో… చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచినట్టు సమాచారం. దీంతో సోహైల్ తో పాటు ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం అయిన కరీంనగర్ తరలిస్తున్నారు. అక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. సోహైల్‌ తల్లి చనిపోవడంతో.. ఇండస్ట్రీలో అతని ఫ్రెండ్స్, సన్నిహితులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సోహైల్ బిగ్ బాస్ తెలుగు 4 అనే బుల్లితెర రియాలిటీ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఆ షో నుంచి బయటకు వచ్చాక లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు.