Vijay devarakonda: ముద్దుగుమ్మల ఫైట్.. విజయ్ పక్కన ఛాన్స్ ఎవరికి..?

ఇక రీసెంట్ మూవీ 'ఖుషి'తో మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఈ రౌడీ హీరో నెక్ట్స్ మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమా నుంచి శ్రీలీల, రష్మిక మందన్నా తప్పుకోగా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నట్లు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2024 | 01:02 PMLast Updated on: Feb 17, 2024 | 1:02 PM

Tripti Dimri Or Rukmini Vasanth Only One Will Be Vijay Devarakonda Movie Heroine

Vijay devarakonda: యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మూవీ చేస్తున్నాడు. VD12 అని తాత్కాలికంగా టైటిల్ పెట్టిన ఈ చిత్రంపై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘లైగర్’ తర్వాత సినిమాలను ఆచితూచి చేస్తున్నాడు. ఇక రీసెంట్ మూవీ ‘ఖుషి’తో మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఈ రౌడీ హీరో నెక్ట్స్ మూవీపై అంచనాలు పెరిగాయి.

PAWAN KALYAN: ఓజీ తుపాన్.. ముంబై హార్బర్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్

అయితే.. ఈ సినిమా నుంచి శ్రీలీల, రష్మిక మందన్నా తప్పుకోగా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నట్లు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. త్రిప్తి డిమ్రి, రుక్మిణి వసంత్.. విజయ్ దేవరకొండ VD12 సినిమాలో నటించేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ మెగా బ్లాక్‌బస్టర్ యానిమల్‌తో వెలుగులోకి రాగా.. రుక్మిణి వసంత్ రొమాంటిక్ డ్రామా సప్త సాగరాలుదాటి సినిమాతో ఫేమస్ అయ్యింది. రౌడీ హీరో పక్కన జతగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. కాగా.. ఈ న్యూస్‌పై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా ఏమీ ధృవీకరించనప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మొదటిసారిగా విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక విజయ్ దేవరకొండ నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో అలరించబోతున్నాడట. ఈ చిత్రం సమ్మర్‌లో రాబోతుందని తెలుస్తోంది. ఇంకా ఫైనల్ డేట్ రావాల్సి ఉంది. విజయ్ సరసన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే.