Trisha: చిక్కుల్లో త్రిష.. పెద్ద తలనొప్పిగా మారిన ‘యానిమల్‌’

ఈ సినిమా గురించి ఒకే ఒక్క పదంలో చెప్తాను ‘కల్ట్‌.. వాహ్’ అంటూ సినిమాని అప్రిషియేట్‌ చేసింది. త్రిష రివ్యూ చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆమెపై ఫైర్‌ అయ్యారు. ‘నువ్వు అసలైన స్త్రీవాదివేనా..? మహిళలను అంత దారుణంగా అవమానించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా..?’ అంటూ సీరియస్‌ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 05:44 PMLast Updated on: Dec 04, 2023 | 5:44 PM

Trisha Deletes Post Calling Ranbir Kapoors Animal A Cult Movie After Facing Criticism

Trisha: ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్‌’ మూవీ డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘యానిమల్‌’ మూవీ చాలా వైలెంట్‌గా ఉంది.. లెంగ్త్‌ ఎక్కువైంది.. అక్కడక్కడా ల్యాగ్‌ ఉంది.. అసభ్యకర సన్నివేశాలు ఎక్కువయ్యాయి.. మహిళలను తక్కువ చేసి చూపించారు.. అయినా సినిమా ఎక్స్‌లెంట్‌గా ఉంది’ ఇవీ సినిమా చూసిన వారి నుంచి వస్తున్న మాటలు. ఇలాంటి కామెంట్లు చూసిన తర్వాత హీరోయిన్‌ త్రిష తను కూడా సినిమాపై స్పందించాలన్న ఉద్దేశంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘యానిమల్‌’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాపై తన రివ్యూను ప్రజెంట్‌ చేసింది. అయితే అదే ఈ బ్యూటీని ఇప్పుడు చిక్కుల్లో పడేసింది.

Animal: అంతా లాభమే.. ‘యానిమల్’ సునామికి సాక్ష్యం ‘

ఈ సినిమా గురించి ఒకే ఒక్క పదంలో చెప్తాను ‘కల్ట్‌.. వాహ్’ అంటూ సినిమాని అప్రిషియేట్‌ చేసింది. త్రిష రివ్యూ చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆమెపై ఫైర్‌ అయ్యారు. ‘నువ్వు అసలైన స్త్రీవాదివేనా..? మహిళలను అంత దారుణంగా అవమానించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా..?’ అంటూ సీరియస్‌ అయ్యారు. మహిళలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినా.. త్రిష మాత్రం ఈ సినిమాను ఆకాశానికెత్తేసి మోసెయ్యడం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ‘యానిమల్‌’ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ ఈ పోస్ట్‌ చేసింది. త్రిష ఈ పోస్ట్‌ పెట్టిన క్షణం నుంచి ఆమెను ట్రోల్‌ చెయ్యడం మొదలు పెట్టారు. యానిమల్‌లో హీరోయిన్‌కే కాదు.. మరే మహిళకు విలువ లేదని, ఫిమేల్‌కి యాంటీగా తీసిన కంటెంట్ అని విమర్శలు పెరిగాయి. ఇలాంటి టైంలో కల్ట్ మూవీ అంటూ యానిమల్‌ని పొగుడుతూ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు మగాళ్లు, ఆడవాళ్లు ఒకటే అంటూ సమానత్వం గురించి మాట్లాడి.. ఇప్పుడు ఓ స్త్రీ ద్వేషంతో నిండిన యానిమల్‌ని పొడుగుతావా అంటూ మండిపడ్డారు.

వెంటనే సోసల్ మీడియాలో త్రిష తన పోస్ట్ తీసేసింది. కానీ, ఈలోపు జరిగే డ్యామేజ్ జరిగింది. తమకి అన్యాయం జరిగితే ఆడ, మగ సమానం.. తనకు జరిగింది అన్యాయం అంటారు. తర్వాత యానిమల్ లాంటి మూవీలొస్తే.. అదో కళాఖండం అనేంతగా పొగిడేస్తారంటూ త్రిషని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో బాగా తిట్టిపోస్తున్నారు. త్రిష పోస్ట్‌ డిలీట్‌ చేసినా ఆ స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.