MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ కోసం రంగంలోకి అతిలోక సుందరీమణులు?
త్రిష అతిలోక సుందరిగా, దేవ కన్యగా కనిపించబోతుంటే, మీనాక్షి చౌదరి కూడా అలాంటి పాత్రే వేస్తోందట. మొత్తం ముగ్గురు దేవ కన్యలు ఈ సినిమాలో ఉండబోతున్నారని తెలుస్తోంది. అందులో త్రిష, మీనాక్షి చౌదరిల పాత్రలు పుకార్లొచ్చినట్టే నిజమైంది.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేం వశిష్ట తీస్తున్న మూవీ విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌లో త్రిష జాయిన్ అయ్యింది. వచ్చే వారం మీనాక్షి చౌదరి జాయిన్ కాబోతోంది. ఇందులో త్రిష అతిలోక సుందరిగా, దేవ కన్యగా కనిపించబోతుంటే, మీనాక్షి చౌదరి కూడా అలాంటి పాత్రే వేస్తోందట.
MAHESH BABU: మహేశ్ బాబు గడ్డంతో రాజమౌళి షాక్ ఇచ్చేస్తున్నాడా..?
మొత్తం ముగ్గురు దేవ కన్యలు ఈ సినిమాలో ఉండబోతున్నారని తెలుస్తోంది. అందులో త్రిష, మీనాక్షి చౌదరిల పాత్రలు పుకార్లొచ్చినట్టే నిజమైంది. మూడో దేవకన్యగా మాత్రం దిశా పటానిని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లందరికి భిన్నంగా సీతారామం, హాయ్ నాన్న ఫేం మృణాల్ ఠాకూర్ మాత్రం మామూలు మనిషి పాత్రలో చిరుతో జోడీకట్టబోతోంది. మొత్తంగా ఒక మామూలు స్త్రీతో పాటు ముగ్గురు దేవకన్యలున్న సినిమాలో చిరు.. లోకాలతో ఫైట్ చేసే సాహస వీరుడిగా కనిపించబోతున్నాడు.
ఇవన్నీ చూస్తే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి కథ కాకుండా, అప్పట్లో ఎన్టీఆర్ ఫేట్ మార్చిన జగదేకవీరుడి కథ స్టోరీ లైన్‌తోనే వచ్చేలా ఉంది. 150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓవర్‌సీస్ రైట్స్ 18 కోట్లకు సేల్ అవటం చూస్తే, షూటింగ్ మొదలవ్వగానే మార్కెట్ షేక్ అవటం ఖాయం అనిపిస్తోంది.