Trisha Krishnan: 40 దాటినా జోరు తగ్గని త్రిష.. వరుస ఆఫర్లతో బిజీ..!

40 ఏళ్లలోకి అడుగుపెట్టినా కూడా వరుస ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ బ్యూటీ త్రిషకు ఈ మ‌ధ్యే 40 ఏళ్లు వచ్చాయి. ఈ వ‌య‌సులో హీరోయిన్ వేషాలు ప‌క్క‌న పెట్టి.. క్యారెక్ట‌ర్ రోల్స్ చేసుకోవాలి. కానీ ఏజ్ భార్ స్టేజ్‌లో కూడా చెక్కు చెద‌ర‌ని అందంతో ఆడియన్స్‌ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2023 | 04:17 PMLast Updated on: Sep 13, 2023 | 4:17 PM

Trisha Krishnan Getting New Offers And Became Busy After She Enters Into Her 40s

Trisha Krishnan: సెంటిమెంట్ మీద నడిచే ఇండస్ట్రీ మనది. హీరోయిన్ల విషయంలో ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. హిట్ ఇస్తున్న హీరోయిన్ వెంట పరుగులు పెడతారు మేకర్స్. కాల్షీట్ల కోసం కాపలా కాస్తారు. ఇదే ఇప్పుడు త్రిషకు ప్లస్ అయింది. 40 ఏళ్లలోకి అడుగుపెట్టినా కూడా వరుస ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ బ్యూటీ త్రిషకు ఈ మ‌ధ్యే 40 ఏళ్లు వచ్చాయి. ఈ వ‌య‌సులో హీరోయిన్ వేషాలు ప‌క్క‌న పెట్టి.. క్యారెక్ట‌ర్ రోల్స్ చేసుకోవాలి. కానీ ఏజ్ భార్ స్టేజ్‌లో కూడా చెక్కు చెద‌ర‌ని అందంతో ఆడియన్స్‌ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.

పొన్నియన్ సెల్వన్ ప్రాజెక్ట్‌తో హిట్ కొట్టిన త్రిష.. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లియోలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే మ‌ణిర‌త్నం దర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ చేయనున్న ప్రాజెక్ట్‌లో కూడా ప్లేస్ కన్ఫామ్ చేసుకుంది. చిరు నెక్స్ట్ మూవీలో త్రిషను తీసుకోవచ్చని ప్రచారం జరుగుతున్న వేళ.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ కొట్టేసింది. తునివు సక్సెస్‌ తర్వాత ‘విడాముయర్చి’ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు అజిత్. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా త్రిష ఎంపికయ్యింది. త్రిష, అజిత్ కాంబినేషన్‌లో ఇది ఐదో సినిమా. గతంలో వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నై అరిందాల్, మంగాత, జై, కిరీటం సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

మొత్తానికి ఒక త‌రం స్టార్ హీరోయిన్ల‌తో న‌టించాక కొత్త బ్యూటీస్ వైపు మొగ్గుచూపుతారు బడా హీరోలు. కానీ త్రిష విషయంలో మాత్రం ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. కారణం.. తన అందంతో త్రిష ఫిలిం మేకర్స్‌ని మంత్రముగ్ధుల్ని చేయడమే. అందుకే 40 ఏళ్ల వయసులో కూడా ఈ బ్యూటీని పిలిచి మరి ఆఫర్స్ ఇస్తున్నారు డైరెక్టర్స్.