Vishwambhara: విజువల్ ట్రీట్.. విశ్వంభరలో త్రిష మరో శ్రీదేవిలా కనిపించనుందా..?

మెగాస్టార్ జోడిగా త్రిష నటిస్తుండటంతో సినిమాపై అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో ఈ బ్యూటీ డబుల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భూలోకానికి చెందిన సామాన్యరాలిగా, అలాగే దేవ లోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2024 | 02:01 PMLast Updated on: Mar 11, 2024 | 2:01 PM

Trisha Playing Dual Role In Megastar Chirajneevis Vishwambhara

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవి దొరబాబు రోల్‌లో కనిపించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా హీరోయిన్ త్రిషపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

KUMARI AUNTY : టీవీ సీరియల్ లో కుమారీ ఆంటీ

మెగాస్టార్ జోడిగా త్రిష నటిస్తుండటంతో సినిమాపై అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో ఈ బ్యూటీ డబుల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భూలోకానికి చెందిన సామాన్యరాలిగా, అలాగే దేవ లోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు. ఈ రెండు పాత్రల్లో త్రిష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి పోషించిన పాత్రలా త్రిష రోల్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అంతకు మించి ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చిరు, త్రిష మధ్య వచ్చే పాటలు నెక్ట్స్ లెవల్‌లో ఉండనున్నాయట.

ఇప్పటికే వశిష్ట.. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయిస్తున్నాడట. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ మూవీలో పాటలు అదరహో అనేలా తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.