Pawan : పవన్‌కు త్రిష స్పెషల్ గిఫ్ట్..
జనసేన అధినేత, ప వన్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశ్వంభర (Vishwambhara) షూటింగ్ లొకేషన్‌లో తన అన్న చిరంజీవిని కలిశారు. నాగబాబుతో కలిసి వెళ్లిన చిరంజీవిని మీట్ అయ్యారు. పవన్ ఆరోగ్యం గురించి, ఏపీలో పార్టీ పరిస్థితి గురించి మాట్లాడిన చిరంజీవి.. జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చారు.

Trisha special gift for Pawan..
జనసేన అధినేత, పవన్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశ్వంభర (Vishwambhara) షూటింగ్ లొకేషన్‌లో తన అన్న చిరంజీవిని కలిశారు. నాగబాబుతో కలిసి వెళ్లిన చిరంజీవిని మీట్ అయ్యారు. పవన్ ఆరోగ్యం గురించి, ఏపీలో పార్టీ పరిస్థితి గురించి మాట్లాడిన చిరంజీవి.. జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చారు. 5 కోట్ల చెక్‌ను జనసేనకు డొనేట్ చేశారు. అధికారంలోకి రాకముందే రైతలుకు పవన్ చేస్తున్న సాయంలో తాను పాలు పంచుకునేందుకు చెక్ ఇచ్చినట్టు ట్వీట్ కూడా చేశాడు.
యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అవుట్‌కట్స్‌లోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఇక్కడే చిరంజీవిని కలిశారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలియడం అటు పార్టీ కార్యకర్తలతో పాటు పవన్ అభిమానుల్లో కొత్త జోష్ నిపింది. ఐతే ఇదే సెట్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ సీన్ కూడా కనిపించింది. పవన్ సెట్స్ వచ్చినప్పుడు అక్కడే ఉన్న త్రిష పవన్ కళ్యాణ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఓ మొక్కను పవన్‌కు బహుకరించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ త్రిష తీన్మార్ సినిమాలో జంటగా నటించారు.
2011లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మళ్లీ త్రిషతో సినిమా చేయలేదు పవన్. 13 ఏళ్ల తరువాత పవన్ త్రిష ఇలా విశ్వభర సెట్స్‌లో కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాదాపు దశాబ్ధం తరువాత ఈ కాంబో కనిపించడంతో ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు.