Trisha : త్రిష షాకింగ్ పారితోషికం
భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ (Tollywood) లోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష (Trisha).
భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ (Tollywood) లోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష (Trisha). గతంలో వీరిద్దరి కలయికలో స్టాలిన్ సినిమా రూపొందింది. ఇక ఇప్పుడు విశ్వంభరతో దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరు, త్రిష కలిసి మళ్లీ నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ డ్రామగా విశ్వంభర తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా.. హనుమంతుడి బ్యాక్ డ్రాప్‌లో సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ షూట్ చేశారు.
అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి త్రిష లుక్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు, అంటే మే 4న త్రిష పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బర్త్ డే విష్ తెలియజేస్తూ రివీల్ చేసిన ఈ పోస్టర్‌లో త్రిష లుక్ మాత్రం సూపర్‌గా ఉందనే చెప్పాలి. దీంతో త్రిష పాత్ర ఈ సినిమాలో హైలెట్‌గా ఉండబోతుందన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. త్రిష ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం త్రిష ఏకంగా 10 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన త్రిష.. దళపతి విజయ్ లియోతో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం కమల్‌హాసన్ (Kamal Haasan), మణిరత్నం (Mani Ratnam) కాంబోలో రూపొందుతోన్న ‘థగ్ లైఫ్’ లో కూడా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అజిత్‌తో ‘విదా ముయార్చి’ సినిమాలో కూడా నటిస్తోంది. ఏదేమైనా.. ఇప్పటికీ కూడా త్రిష క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి.