Trivikram-Jr NTR: ఈసారి ఫిక్స్.. బర్త్ డేకి.. ‘ఎన్టీఆర్-త్రివిక్రమ్’ బిగ్ అప్డేట్

ఢిల్లీ బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో త్రివిక్రమ్ సినిమా ప్లేస్‌లో కొరటాల శివ ‘దేవర’ వచ్చి చేరింది. కానీ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2024 | 03:12 PMLast Updated on: Apr 07, 2024 | 3:12 PM

Trivikram And Jr Ntr Combo Will Announce Soon On Ntr Birth Day

Trivikram-Jr NTR: గుంటూరు కారం సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. వాస్తవానికైతే గుంటూరు కారం ప్లేస్‌లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఉండాల్సింది. అరవింద సమేత వీరరాఘవ సినిమాతో హిట్ కొట్టిన వెంటనే.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. NTR30గా అనౌన్స్ అయిన ఈ సినిమాకు.. ‘అయిననూ పోయి రావాలె హస్తినకు’ అనే టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Sai Pallavi: కథ నచ్చితేనే సినిమా.. సాయిప‌ల్ల‌వి డిమాండ్ చేయకుండానే 10 కోట్లా..?

ఢిల్లీ బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో త్రివిక్రమ్ సినిమా ప్లేస్‌లో కొరటాల శివ ‘దేవర’ వచ్చి చేరింది. కానీ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికే అల్లు అర్జున్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. కానీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. బన్నీతో లైన్లోకి రావడంతో కష్టమే అంటున్నారు. దీంతో.. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నెక్స్ట్ వార్ 2ని 60 రోజుల్లో కంప్లీట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రశాంత్ నీల్.. ‘సలార్ 2’ అయ్యాకే ఎన్టీఆర్ 31 మొదలు పెడతాడు.

ఎంత కాదనుకున్నా సలార్ 2 కోసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. ఇక దేవర 2.. దేవర 1 రిజల్ట్‌ని బట్టి కొంచెం ముందు వెనక స్టార్ట్ అవుతుంది. దీంతో ఇమ్మిడియట్‌గా సెట్స్‌పైకి వెళ్లడానికి త్రివిక్రమ్‌కు ఇప్పుడు సూపర్ ఛాన్స్ ఉంది. అందుకే.. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో చూడాలి.