TRIVIKRAM: త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ అలిగారా..? కారణం.. ఆ ఇద్దరు హీరోలేనా..?

జవాన్ హిట్ తర్వాత షారుఖ్‌తో మరో మూవీ ప్లాన్ చేశాడు అట్లీ. కానీ, అది 2025 దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అందుకే ఈ లోపు బన్నీతో మూవీ ప్లాన్ చేశాడట. ఫిబ్రవరిలో అది లాంచ్ అవుతుందట. దీంతో ఆ మూవీ తర్వాతే త్రివిక్రమ్ సినిమా అనేశాడట బన్నీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 08:02 PMLast Updated on: Dec 27, 2023 | 8:02 PM

Trivikram And Prashanth Neel Angry On Allu Arjunjr Ntr

TRIVIKRAM: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. గుంటూరు కారం షూటింగ్ అనుకున్న టైంకి కావట్లేదని ప్రెజర్‌లో ఉన్నాడు. పెండింగ్ సాంగ్ పూర్తి కాకపోవటంతో మహేశ్ తన వెకేషన్‌ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒకవైపు సాంగ్ పూర్తి చేయటం, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉండటం, ఇంకా సినిమా ప్రమోషన్ షురూ కాకపోవటం.. ఇన్ని ప్రెజర్స్ మధ్య ఇప్పుడు బన్నీతో తన సినిమా ఆల్‌మోస్ట్ ఆగిపోయింది. లేదంటే ఒక ఏడాదికిపైనే వాయిదా పడింది. ఇది త్రివిక్రమ్‌కి వచ్చిన కొత్త తలనొప్పి.

PRABHAS: స్పిరిట్ విషయంలో మాట మార్చిన సందీప్ రెడ్డి

కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సడన్‌గా తమిళ దర్శకుడు అట్లీకి కనెక్ట్ అవటం. జవాన్ హిట్ తర్వాత షారుఖ్‌తో మరో మూవీ ప్లాన్ చేశాడు అట్లీ. కానీ, అది 2025 దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అందుకే ఈ లోపు బన్నీతో మూవీ ప్లాన్ చేశాడట. ఫిబ్రవరిలో అది లాంచ్ అవుతుందట. దీంతో ఆ మూవీ తర్వాతే త్రివిక్రమ్ సినిమా అనేశాడట బన్నీ. అంతే మరో ఏడాది ఖాళీగా ఉండేందుకు ఇష్టపడని మాటల మాంత్రికుడు.. ఇంతలో న్యాచురల్ స్టార్ నానితో సినిమాకి ప్లాన్ చేశాడు. మార్చ్‌లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడు. ఇది డెఫినెట్‌గా బన్నీ మీద అలిగే త్రివిక్రమ్ వేగంగా నాని సినిమాకు కమిటయ్యాడంటున్నారు. ఇంచుమించు ఇలానే ఎన్టీఆర్ మీద అలిగిన ప్రశాంత్ నీల్.. వెంటనే తమిళ్ హీరో అజిత్‌కి కథ చెప్పాడట.

దేవర 80 శాతం పూర్తైందని నిర్మాత కమ్ తారక్ బ్రదర్ అయిన కళ్యాణ్ రామ్ తేల్చాడు. కాని మిగతా 20శాతం షూటింగ్‌కి మరో మూడు నెలలు టైం పడుతుందట. దీంతో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ఇంకాస్త డిలే అవుతుండటంతో లెక్కలన్నీ తారుమారయ్యాయి. కాబట్టే ప్రశాంత్ నీల్‌తో తారక్ మూవీ కనీసం ఏడాది వాయిదా పడుతోంది. అందుకే ఈలోపు అజిత్‌కి కథ చెప్పాడట ప్రశాంత్ నీల్. ఇలా నీల్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా బన్నీ, ఎన్టీఆర్ విషయంలో అలిగారని తెలుస్తోంది.