Guntur Karam : త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్.. గుంటూరు కారం లో యంగ్ టైగర్.. పూనకాలే
టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar, Mahesh Babu) – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam) పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేసిన ఈ కాంబో ముచ్చటగా వస్తున్న మూడో సినిమా ఇది.

Trivikram Cinematic Universe Young Tiger in Guntur Karam Poonakale
టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar, Mahesh Babu) – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam) పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేసిన ఈ కాంబో ముచ్చటగా వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో చిత్రంపై క్ష రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ధమ్ బిర్యాని పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అంతేకాక ఈ మూవీలో మహేష్ ఊరమాస్ గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Samantha : సామ్ సెగలు.. స్విమ్ సూట్ లో సమంత
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ న్యూస్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ఈ మేరకు ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అరవింద సమేత వీర రాఘవ సినిమాకు గుంటూరు కారం సినిమాకు సంబంధం ఉందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నాడట. ఆ కారణంతోనే గుంటూరు కారం సినిమాలో యంగ్ టైగర్ కనిపించనున్నారట.
ఆ ఫొటోలో గుంటూరు కారం, అరవింద సమేతలోని కొన్ని సీన్ల షాట్లను కలిపి ఉంచారు. అరవింద సమేత సినిమాకు సంబంధించిన ఓ ఫొటోలో జూ.ఎన్టీఆర్ పక్కన ఈశ్వరీ రావు ఉన్నారు. గుంటూరు కారం సినిమాకు సంబంధించిన మరో ఫొటోలో మహేష్ బాబు పక్కన కూడా ఈశ్వరీ రావు ఉన్నారు. రెండు ఫొటోల్లో ఆమె లుక్ ఒకటేలాగా ఉంది. మరో రెండు ఫొటోల్లో ఇంటిపై.. కారుపై ఒకే గుర్తు ఉంది. దీంతో ప్రచారం ఊపందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ యూనివర్స్‌ను క్రియేట్ చేయడానికే పూజా హెగ్డేను తొలగించారని కొత్త ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సింది.