TRIVIKRAM: టాలీవుడ్ గురూజీకి ఝలక్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్స్

బిజీగా ఉన్న తారక్‌ని మునగ చెట్టెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించాడు. టిల్లూ స్క్వేర్ ఈవెంట్లో తెగ పొగిడేశాడు. అయినా ఎన్టీఆర్ కనీసం కథా చర్చలకు కూడా అపాంట్‌మెంట్ ఇవ్వలేదు. బన్నీ ఏకంగా త్రివిక్రమ్‌తో సినిమా ఎనౌన్స్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 07:18 PMLast Updated on: Apr 15, 2024 | 7:18 PM

Trivikram Is Waiting For Movie Offer With Stars Like Allu Arjun Jr Ntr

TRIVIKRAM: త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు. సినిమాల్లో డైలాగ్స్ మంత్రాల్లా బాగా రాస్తాడని అలా అంటారు. కాని, తన పెన్ను కంటే నోరే ఈ మధ్య మాటల మంత్రాలు వేస్తోంది. మొన్న అలాగే ఎన్టీఆర్‌ని ఆకాశానికెత్తాడు. తనతో మరో మూవీ పట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు. కాని ఏమైంది..? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. ఒకవైపు దేవర పార్ట్ 1 షూటింగ్‌కి బ్రేక్ వేసి వార్ 2 షూటింగ్‌తో బిజీ అయ్యాడు.

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ విచారణ వాయిదా

జూన్‌లో దేవరకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు. అలా 3 పాటల షూటింగ్ పూర్తి చేశాక, దేవర 2 కి రెడీ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే వార్ 2 ని కూడా పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ఇలా బిజీగా ఉన్న తారక్‌ని మునగ చెట్టెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించాడు. టిల్లూ స్క్వేర్ ఈవెంట్లో తెగ పొగిడేశాడు. అయినా ఎన్టీఆర్ కనీసం కథా చర్చలకు కూడా అపాంట్‌మెంట్ ఇవ్వలేదు. బన్నీ ఏకంగా త్రివిక్రమ్‌తో సినిమా ఎనౌన్స్ చేశాడు. తర్వాత ఆట్లీ ప్రాజెక్ట్‌కి షిప్ట్ అయ్యాడు.

పుష్ప 2 పూర్తి కాగానే ఆట్లి సినిమాతో అల్లు అర్జున్ బిజీ కాబోతున్నాడు. త్రివిక్రమ్‌కి అందుబాటులో లేడని తెలుస్తోంది. అసలే చెర్రీ నుంచి బన్నీ వరకు టాప్ స్టార్స్ ఎవరూ రెండేళ్ల వరకు అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. అలాంటిది గుంటూరు కారం లాంటి పంచ్ ఇచ్చిన త్రివిక్రమ్‌కి బన్నీ, చెర్రీ, తారక్ అండ్ కో డేట్లు ఇస్తారనుకోవటం అమాయకత్వమే.