Allu Arjun: కత్తి కాంతారావుగా బన్నీ
కత్తి కాంతారావు అంటేనే సోషియో ఫాంటజీ మూవీలకు కేరాఫ్ అడ్రస్. ఒంటికన్ను రాక్షసుడు, ఏడు సముద్రాలు అవతల మర్రిచెట్టు తొర్రలో గుండెను దాచిన మాంత్రికుడు.. ఇలాంటి విలన్లు కత్తితో దూసుకెళ్లే కాంతారావు.. అప్పట్లో ఆ జోనర్ కి బ్రాండ్ కాంతరావు. ఇప్పడు ఆయన మూవీనే బన్నీ చేయబోతున్నాడట.

Trivikram Kathi Kantha Rao with Allu Arjun is reportedly going to make a socio fantasy film
బన్నీతో త్రివిక్రమ్ సినిమా కన్ఫామ్ అయ్యింది. వీళ్ల కాంబినేషన్ లో జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లాంటి హ్యాట్రిక్ కిక్ వచ్చింది. ఇప్పుడు నాలుగో సినిమాగా సోషియో ఫాంటసీ సినిమా ప్లానింగ్ జరుగుతోంది.
కాంతారావు హిట్ మూవీ దేవుని గెలిచిన మానవుడుని త్రివిక్రమ్ రీమేక్ చేస్తాడో, లేదంటే లిఫ్ట్ ఇరిగేషన్ పద్దతిలో కథని ఎత్తేస్తాడో కాని, ఆ సినిమా గురించి బన్నీతో మాటల మాంత్రికుడు చర్చించాడని తెలుస్తోంది.
గతంతో అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ సినిమాలకు సీన్లు లేదంటే.. స్టోరీలు కాపీ కొట్టాడని కామెంట్లు వచ్చాయి. ఇక అల వైకుంఠపురంలో కూడా ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటిగుట్టు కథని లేపేశాడనే కామెంట్స్ చేశారు. ఇప్పుడు కత్తి కాంతారావు హిట్ మూవీ దేవుని గెలిచిన మానవుడు మూవీ కథతో పాన్ఇండియా సోషియో ఫాంటసీ మూవీ తీయబోతున్నాడట త్రివిక్రమ్. టైటిల్ మాత్రం కత్తి కాంతారావే అనంటున్నారు. ఆ పేరుని త్రివిక్రమ్ రిజిస్టర్ చేయటం వల్లే ఈ గుసగుసలు పెరిగాయి.