Trivikram: మహేశ్ బాబు భయపడుతున్నాడు.. షూటింగ్ క్యాన్సిల్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు భయపడ్డాడు. తన వల్ల కాదు బాబోయ్ అన్నాడు. దెబ్బకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన కొత్త సినిమా షూటింగ్ తాలూకు కొత్త షెడ్యూల్ ని ఆపేశాడు. అసలా ఆలోచననే అటకెక్కించాడు.

Trivikram Mahesh Babu Movie Shooting stoped
అంటే త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ చేస్తున్న సినిమా ఆగిందా అంటే, ఆగలేదు అనాల్సిందే. అలాని తెరకెక్కుతుందా అంటే, అది కూడా ఆలోచించాల్సిందే.. ఎందుకంటే త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ చేసే మూవీ కొత్త షెడ్యూల్ ఈనెల 21 న ప్లాన్ చేశారు. కాని మహేశ్ పారీస్ ట్రిప్ అయిపోలేదు. సరే కొత్త షెడ్యూల్ ని వాయిదా వేసి మే ఫస్ట్ వీక్ ప్లాన్ చేద్దామనుకున్నాడు త్రివిక్రమ్.
కాని మహేశ్ నుంచి నో రెస్పాన్స్.. హైద్రబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. కరోనా సోకినప్పుడు తనకి వచ్చిన స్కిన్ డిసీస్ వల్ల మహేశ్ ఎండనుతట్టుకోలేకపోతున్నాడట. అందుకే మే, జూన్ అయిపోయే వరకు నో షూటింగ్ అంటున్నాడట మహేశ్. సో పారిస్ ట్రిప్ అయిపోగానే వెనీస్ ట్రిప్ ప్లాన్ చేశాడట మహేశ్. ఎలాగూ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబట్టి చాలా టైం ఉంది.. సో ఎండలో ఇబ్బంది పడేకంటే, అవి తగ్గాకే షూటింగ్ ప్లాన్ చేయమన్నాడట మహేశ్.