TRIVIKRAM: త్రివిక్రమ్‌ను ఎందుకు ఆడుకున్నారో తెలుసా..?

అతడు.. ఖలేజా కమర్షియల్‌గా వర్కౌవుట్ కాకపోయినా.. ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్‌కే కాదు చాలామందికి నచ్చాయి. మరోసారి ఈ కాంబోలో వచ్చిన గుంటూరుకారం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. ఈ మూవీని ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగానీ ముందు నుంచి త్రివిక్రమే టార్గెట్ అయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2024 | 03:08 PMLast Updated on: Jan 26, 2024 | 3:08 PM

Trivikram Maintain Distance From Guntur Kaaram Movie Team

TRIVIKRAM: గుంటూరుకారం మూవీలో ప్రకాష్‌ రాజ్‌ విలన్‌ అయితే.. రిలీజ్‌ తర్వాత మాత్రం తివిక్రమ్ చాలా మందికి విలన్ అయ్యాడు. గుంటూరు కారం రిలీజ్‌ తర్వాత త్రివిక్రమ్‌‌పైనే ట్రోలింగ్‌ ఎందుకు జరిగిందో తెలుసా..? గుంటూరు కారం సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసినా.. త్రివిక్రమ్‌ ఎందుకు కనిపించలేదు..? గుంటూరుకారం మూవీకి త్రివిక్రమ్ ఎందుకు దూరంగా వున్నాడు..? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. అతడు.. ఖలేజా కమర్షియల్‌గా వర్కౌవుట్ కాకపోయినా.. ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్‌కే కాదు చాలామందికి నచ్చాయి. మరోసారి ఈ కాంబోలో వచ్చిన గుంటూరుకారం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

PAWAN KALYAN: రెండు సీట్లు ప్రకటించిన జనసేన.. టీడీపీ సీట్ల ప్రకటనపై పవన్ ఆగ్రహం

అయితే.. ఈ మూవీని ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగానీ ముందు నుంచి త్రివిక్రమే టార్గెట్ అయ్యాడు. గుంటూరుకారం షూటింగ్‌ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. కథ సెట్‌ కాలేదని.. స్క్రిప్ట్‌ మారిందన్న వార్తలు ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. అల వైకుంఠపురంలో రిలీజ్‌ తర్వాత మూడేళ్లు వచ్చిన గ్యాప్‌లో స్క్రిప్ట్‌ రెడీ చేయలేకపోయారా..? అంటూ అభిమానులు త్రివిక్రమ్‌పై మండిపడ్డారు. అన్నీ తానై పవన్‌కల్యాణ్ సినిమాలను, కెరీర్‌ను డిజైన్‌ చేశాడు త్రివిక్రమ్‌. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీరమల్లును పక్కన పెట్టించి భీమ్లా నాయక్‌, బ్రో తీసుకొచ్చిన త్రివిక్రమ్‌ ఇండస్ట్రీలో చాలామందికి శత్రువయ్యాడట. పవన్ కళ్యాణ్ వ్యవహారాలు చూడటంలో ఉన్న శ్రద్ధ సినిమాలపై లేదని కొందరు ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నారు. హరీష్ శంకర్, క్రిష్ లాంటి వాళ్లు పవన్‌ని త్రివిక్రమ్ తన స్వార్థం కోసం పక్కదారి పట్టించాడని ఆగ్రహంతో ఉన్నారు. తన సినిమాల కోసం మమ్మల్ని దెబ్బతీశాడని గొల్లుమంటున్నారు.

MEGASTAR CHIRANJEEVI: చిరంజీవికి పద్మవిభూషణ్.. ఆయన సాధించిన అవార్డులు ఇవే

త్రివిక్రమ్ మాటల కోసం.. ఆయన సినిమాలను ఒకటికి రెండు సార్లు చూసే ఫ్యాన్స్‌ వున్నారు. అయితే.. హాసిని హారిక, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మాతగా మారడం.. ఆయా సినిమాల కథలో పాల్గొనడంతో.. గుంటూరుకారంపై ఏకాగ్రత పెట్టలేదని.. అందుకే సినిమా ఆలస్యమైందంటూ సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ గురూజీపై విమర్శలు గుప్పించారు. గుంటూరుకారం కథ మధ్యలో మారిపోయింది. హీరోయిన్‌ పూజా హెగ్దే. కెమెరామేన్‌ మారిపోయారు. ఆర్నెల్లపాటు ఆరామ్‌గా తీయాల్సిన సినిమాను 3 నెలల్లో స్పీడ్‌గా తీసేసి.. చుట్టేశారన్న కామెంట్స్‌ ఫేస్‌ చేశాడు గురూజీ. గుంటూరు కారం ఒంటిగంట ఆటతో రిలీజ్‌ కాగా.. డిజాస్టర్‌ టాక్ వచ్చింది. మరో అజ్ఞాతవాసి అవుతుందన్నంతగా టాక్‌ నడిచింది. సగానికి సగం పోతుందని డిస్ట్రిబ్యూటర్స్‌ భయపడిపోయారు. చివరికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో కొంత పాజిటివ్‌ టాక్‌ రావడం.. సంక్రాంతి పుణ్యమా అని.. రూ.230 కోట్ల గ్రాస్‌.. రూ.110 కోట్ల షేర్‌ కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా కోలుకుని ఒడ్డునపడినా.. రిలీజ్‌ తర్వాత గురూజీ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గుంటూరుకారం రిలీజ్‌కు ముందు, తర్వాత త్రివిక్రమ్ కనిపించింది తక్కువే. తనదైన వాగ్ధాటితో అనర్గళంగా మాట్లాడే త్రివిక్రమ్.. ప్రి రిలీజ్‌ ఈవెంట్లో మహేశ్‌ గురించి మాత్రమే మాట్లాడి సరిపెట్టాడు. సక్సెస్‌ తర్వాత మాట్లాడతాడనుకుంటే.. బైటకొచ్చి ప్రమోషనే చేయలేదు. మహేశ్‌, శ్రీలీలతో సుమ ఇంటర్వ్యూ ఒక్కటే బైటకొచ్చింది. సక్సెస్‌ మీట్‌ పెడతామని నిర్మాత చెప్పినా.. అదీ జరగలేదు. ముఖ్యంగా.. త్రివిక్రమ్‌ మౌనం వీడలేదు. గుంటూరుకారంను పట్టించుకోలేదు. ఇంటర్నల్‌గా ఎన్ని జరిగినా ప్రమోషన్‌ చేయకపోవడంతో గుంటూరుకారం అన్నీ వున్నా అనాథ అయిపోయింది. సినిమాలో హీరో తల్లి ప్రేమకు దూరంగా పెరిగినట్టు.. ఈ రమణగాడు ప్రమోషన్‌కు నోచుకోలేకపోయాడు. ఫైనల్‌గా గుంటూరు కారం ఫెయిల్యూర్‌కి కారణం త్రివిక్రమ్ అని తేల్చారు. అయితే గురూజీని ట్రోల్‌ చేసింది ఒక్క మహేష్ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో పెరిగిన శత్రువులు. వాళ్ల మిత్రులు కూడా. అది అసలు కథ.