Trivikram: గురూజీ.. అక్కడ కూడా మీకు అవమానం తప్పలేదా..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాను కూడా అల్లు అరవిందే నిర్మిస్తారని తెలిసింది. అయితే దాన్ని పక్కన పెట్టి సడన్‌గా అల్లు అరవింద్, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అని చెబుతున్నారు.
Trivikram: స్టార్ హీరోల విషయంలో కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ డైరెక్టర్‌తో సినిమా చెయ్యాలి, ఎవరితో చెయ్యకూడదు అనే క్లారిటీ హీరోలకు ఉంటే ఇండస్ట్రీకి మంచి సినిమాలే వస్తాయి. అయితే ఒక్కోసారి ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల కొన్ని ప్రాజెక్టులు మిస్ ఫైర్ అవుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఎంతో లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాము పక్కన పెట్టాలనుకుంటున్న డైరెక్టర్‌ని ఏ కారణం చేత తప్పించాలి అనే విషయాన్ని డీల్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.
PAWAN KALYAN-ATLLE: క్రేజీ కాంబో.. పవన్‌తో అట్లీ మూవీ.. రూ.1000 కోట్ల బడ్జెట్
దానికి ఎంతో తెలివి, మరెంతో నేర్పు, టైమింగ్ కావాలి. అవన్నీ తనకి ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఇంతకీ ఏ డైరెక్టర్‌ని తప్పించారు అనే విషయంలోకి వెళితే.. త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఈమధ్యకాలంలో అందర్నీ షాక్‌కి గురి చేసిన వార్త ఏదైనా ఉందీ అంటే.. అల్లు అరవింద్, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా. ఇదే అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. వీరి కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలని అఖండ టైమ్ నుంచే అనుకుంటున్నారు. అఖండ తర్వాత తమ బేనర్‌లోనే బోయపాటి సినిమా చెయ్యబోతున్నారని అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే అది ప్రకటనతోనే ఆగిపోయింది. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి ఊసూ లేదు. రామ్‌తో చేసిన ‘స్కంద’ ఫ్లాప్ తర్వాత సడన్‌గా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి చేరాడు బోయపాటి. బన్నీతో ‘సరైనోడు’ వంటి భారీ హిట్‌నిచ్చిన బోయపాటి మళ్ళీ అలాంటి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని రెడీ చేసే పనిలో పడిపోయాడు. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
ఈ సినిమాను కూడా అల్లు అరవిందే నిర్మిస్తారని తెలిసింది. అయితే దాన్ని పక్కన పెట్టి సడన్‌గా అల్లు అరవింద్, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అని చెబుతున్నారు. హీరో ఎవరు అనేది చెప్పకుండా సినిమా ఎనౌన్స్ చెయ్యడంలో మతలబు ఏమిటి అనేది అందరి ప్రశ్న. అసలు బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో అభిమానులకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు బోయపాటి సినిమాను అల్లు అరవింద్ తెరపైకి తీసుకు రావడానికి కారణం గుంటూరు కారం ఫలితమేనని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చడీ చప్పుడు చేయని గీతా కాంపౌండ్, ఇప్పుడు బోయపాటి కాంబినేషన్‌లో బన్ని సినిమా అంటూ ఎనౌన్స్ చేశారు.