Super Star: మహేశ్ బాబుని.. త్రివిక్రమ్ అలా చూపించబోతున్నాడా?
మహేశ్ బాబు మొన్న ఒక లుక్ తో షాక్ ఇచ్చాడు. మజిల్స్ పెంచాడు. రీసెంట్ గా హేయిర్ స్టైల్ మార్చి కిక్ ఇచ్చాడు. లుక్ వరకు ఓకే, కాని త్రివిక్రమ్ మేకింగ్ లోమూడో సారి సినిమా చేస్తున్న మహేశ్, ఇందులో ఎలా ఉంటాడనే ప్రశ్నే ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Mahesh different look in Trivikram movie
సూపర్ స్టార్ మహేశ్ బాబు టైమింగ్ పోకిరి కంటే ముందే మారింది. దానికి కారణం అతడు.. అందుతో తక్కువ మాట్లాడి ఎక్కుడ షాక్ ఇచ్చే వయోలెంట్ రోల్లో కనిపించాడు మహేశ్. అది జనాలకు అంతగా ఎక్కేసింది కాబట్టే, పోకిరిటీ అతడు వల్ల పరోక్షంగా హెల్ప్ అయ్యిందన్నారు.
ఇదే మహేశ్ బాబుని త్రివిక్రమ్ ఖలేజాలో వాగుడు కాయ్ గా చూపించాడు. అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడే పాత్రలో ఊర మాస్ కామెడీ టైమింగ్ లో మహేశ్ ని చూపించాడు. రెండూ విభిన్నమైన రీతులు. అందుకే మూడో సారి మహేశ్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో సూపర్ స్టార్ సైలెంట్ కిల్లరా; వయోలెంట్ మాస్ మహారాజానా అనే డౌట్ పెరుగుతోంది. ఐతే ఇందులో మహేశ్ డ్యూయెల్ రోల్స్ వేస్తున్నాడు కాబట్టి, అటు అతడు, ఇటు ఖలేజాలో మహేశ్ వేసిన పాత్రల ఫ్లేవర్స్ యాడ్ కాబోతున్నాయి. కేవలం లుక్ మాత్రమే మారబోతోంది.. ఇది ఫిల్మ్ నగర్ లో ఘోస్ట్ రైటర్ల మధ్యజరుగుతున్న చర్చ.