PAWAN KALYAN: మళ్లీ మాటల మాంత్రికుడితో పవర్ స్టార్ మూవీ..?
జీ సినిమాస్ బ్యానర్‌లో పవన్‌తో త్రివిక్రమ్ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. కాని, పవన్‌కు ఏప్రిల్ ఎండ్ వరకు ఏపీలో ఎలక్షన్స్ వేడితో సరిపోతుంది. ఇలాంటి టైంలో పవన్‌తో త్రివిక్రమ్ సినిమా అంటే ఇప్పట్లో కష్టమే అనుకోవాల్సి వస్తోంది.

PAWAN KALYAN: త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్‌లో పవన్ కళ్యాన్ రెండు హిట్లు, ఒక ఫ్లాప్ సొంతం చేసుకన్నాడు. జల్సా, అత్తారింటికి దారేది రెండు బ్లాక్ బస్టర్లైతే, అజ్ఞాతవాసి మాత్రం షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మాత్రం వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాలేదు. ఈసారి ఇది సాధ్యమయ్యేలా ఉంది. జీ సినిమాస్ బ్యానర్‌లో పవన్‌తో త్రివిక్రమ్ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. కాని, పవన్‌కు ఏప్రిల్ ఎండ్ వరకు ఏపీలో ఎలక్షన్స్ వేడితో సరిపోతుంది.
PRABHAS-ALLU ARJUN: బన్నీ, ప్రభాస్ నిర్ణయంతో రూమర్స్‌కి బ్రేక్ పడినట్టేనా..?
మే మొదటి వారం నుంచి ఓజీ షూటింగ్ అన్నారు. ఇలాంటి టైంలో పవన్‌తో త్రివిక్రమ్ సినిమా అంటే ఇప్పట్లో కష్టమే అనుకోవాల్సి వస్తోంది. ఆట్లీ మూవీకి సై అని త్రివిక్రమ్‌కి బన్నీ హ్యాండ్ ఇచ్చాడు. చిరుతో ఛాన్స్ కష్టమంటున్నారు. మిగతా స్టార్స్ అంతా ఫుల్ బిజీ. దీంతో మళ్లీ త్రివిక్రమ్.. పవన్ శరణు కోరాడు అంటున్నారు. దానికి జీ సినిమాస్ బ్యానర్ తోడైందని తెలుస్తోంది. ఐతే ఓజీ ఇంకా 50శాతం పెండింగ్ షూటింగ్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం పదిశాతమే తెరకెక్కింది. మూడేళ్లుగా హరి హర వీరమల్లు మూలకుపడి ఉంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే ఏడాది పట్టేలా ఉంది.
అంతవరకు త్రివిక్రమ్ ఆగుతాడా అంటే, లేదు మేలోనే పవన్‌తో తన సినిమా పట్టాలెక్కి, జులైనుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇదే జరిగితే, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ టీం, హరిహర వీరమల్లు టీమ్స్‌తోపాటు ఇండస్ట్రీ జనం కూడా త్రివిక్రమ్ మీద కామెంట్ల వర్షం కురిపించే ఛాన్స్ ఉందంటున్నారు.