TRIVIKRAM-VIJAY: రష్మికతో విజయ్ 7 అడుగులు.. పూజారి త్రివిక్రమే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ రౌడీస్టార్ విజయ్‌తో సినిమా ప్లాన్ చేశాడు. తీయబోతున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో కాప్‌గా మారబోతున్న విజయ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2024 | 05:53 PMLast Updated on: Apr 19, 2024 | 5:53 PM

Trivikram Planning A Movie With Vijay Devarakonda And Rashmika Mandanna

TRIVIKRAM-VIJAY: రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ, తాము స్నేహితులమే అంటూ అందరూ చెప్పే మాటలే చెబుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఇద్దరి మధ్య ఏం లేనిదే, రష్మిక ఎందుకు తన ఫోన్‌లో విజయ్ పేరుని ఎలా సేవ్ చేసుకుందో ఎందుకు చూపించదనే కామెంట్ ఆమధ్య రణ్‌బీర్ కపూర్ చేశాడు. సరే ఆ సంగతి అటుంచితే, ఈ ఇద్దరూ ఏడడుగులు నడిచేందుకు టైం వచ్చినట్టుంది.

MAHESH BABU-SS RAJAMOULI: బాక్సాఫీస్ వేట.. మహేష్‌ బాబు, రాజమౌళి టైం వచ్చేసింది

త్రివిక్రమ్ శ్రీనివాస్ రౌడీస్టార్ విజయ్‌తో సినిమా ప్లాన్ చేశాడు. తీయబోతున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో కాప్‌గా మారబోతున్న విజయ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడట. మాటల మాంత్రికుడు కూడా చెర్రీ నుంచి తారక్ వరకు అంతా బిజీగా ఉన్నారు. ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్ చివరికి హ్యాండ్ ఇవ్వటంతో ఇప్పుడు దిక్కుల చూస్తున్నాడు గురూజీ. అందుకే విజయ్ దేవరకొండే తనకి దిక్కయ్యాడని తెలుస్తోంది. గతంలో అల వైకుంఠపురంలో కథ చెబితే రౌడీ నో చెప్పాడు. ఆ కథ మార్చి బన్నీతో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

విచిత్రం ఏంటంటే గుంటూరు కారం కథ కూడా ముందు విజయ్‌తో ప్లాన్ చేస్తే నిర్మాత విషయంలో రాజీ కుదరక, కథమారి, అది మహేశ్ గూటికి చేరింది. సూపర్ స్టార్ ఎకౌంట్‌లో ఫ్లాప్ పడింది. ఏదేమైనా మూడోసారి విజయ్, త్రివిక్రమ్ మధ్య కథా చర్చలు బానే జరుగుతున్నాయి. సినిమాలో రష్మిక కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్-త్రివిక్రమ్ సినిమా సెన్సేషన్‌గా మారేలా ఉంది.