బన్నీకి త్రివిక్రమ్ స్ట్రోక్… మూవీ క్యాన్సిల్ అయినట్టేనా…?
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలమాలో పడిపోయారా...? అంటే అవుననే ఆన్సర్ వినపడుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలమాలో పడిపోయారా…? అంటే అవుననే ఆన్సర్ వినపడుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు అల్లు అర్జున్ ను అన్ని వర్గాల నుంచి టార్గెట్ చేయడం అటు మెగా ఫ్యామిలీ కూడా బన్నీ విషయంలో సీరియస్ గా ఉండటంతో ఇప్పుడు త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కథ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్న త్రివిక్రమ్ జనవరి నుంచి ఈ సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాడు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నామని కూడా నెల రోజుల క్రింద ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే మెగా ఫ్యామిలీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా క్లోజ్ గా ఉంటాడు. సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ కూడా కాస్త స్పీడ్ మీద ఉన్నాడు.
అయితే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో కాస్త మెంటల్ గా డిప్రెషన్ లో ఉన్నట్లే కనపడుతుంది. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ లో కూడా కాస్త మార్పు వచ్చింది. అనవసరమైన సమస్యల్లో ఇరుక్కున్నాను అనే బాధ అతనిలో స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు సినిమా మొదలుపెట్టినా కంప్లీట్ గా ఫోకస్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందుకే అల్లు అర్జున్ కూడా ఈ సినిమా విషయంలో పెద్దగా సీరియస్ గా లేడని… ఒక మూడు నాలుగు నెలలు గ్యాప్ తీసుకుని పరిస్థితులన్నీ సెట్ అయిన తర్వాత వేసవి నుంచి సినిమాను మొదలు పెట్టే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం.
గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్లిక్ కావడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అల్లు అర్జున్ కు పుష్ప సినిమాతో నార్త్ ఇండియా మార్కెట్ భారీగా పెరిగింది. అందుకే బడ్జెట్ విషయంలో సూర్యదేవర నాగవంశీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను మొదలుపెట్టినా అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నట్లే ఉంటుంది అనే ఒపీనియన్ కూడా ఉంది. ఒకవైపు కోర్టు కేసులు పోలీసులు సీరియస్ గా ఉండటం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనకడుగు వేయకపోవడంతో రిస్క్ చేసేందుకు ఇష్టపడటం లేదు.