Guntur Kaaram: కారం కోసం నిప్పుల మీద త్రివిక్రమ్ నడక
సంక్రాంతికి నాలుగున్నర నెలలే టైం ఉంది. ఈలోపు గుంటూరు కారం పూర్తి కావాలంటే త్రివిక్రమ్ నిప్పుల మీద నడిచినట్టే సినిమాను వేగంగా పూర్తి చేయాలి. ఇది మామూలు టాస్క్ కాదు. వేగం మత్తులో ముందుకెలితే క్వాలిటీ పడిపోతుంది.

Guntur Kaaram: గుంటూరు కారం షూటింగ్ ఈ నెల 16 నుంచే మొదలైంది. మహేశ్‌లేని సీన్లు తీస్తున్న త్రివిక్రమ్‌కి 20 నుంచి అసలైన అగ్ని పరీక్ష షురూ కాబోతుంది. ఎందుకంటే ఆదివారం నుంచే మహేశ్ సెట్లో అడుగు పెట్టడం, తమన్ ఇంకా పాటలు రెడీ చేయకపోవటం హాట్ టాపిక్ అయ్యింది. అసలే హీరోయిన్ నుంచి కథలో క్లారిటీ వరకు చాలా విషయాల్లో మహేశ్ ఫైర్ అయ్యాడని ఎన్నో సార్లు లీకులు బయటికొచ్చాయి. ఏదేమైనా ఇప్పుడు సంక్రాంతికి నాలుగున్నర నెలలే టైం ఉంది.
ఈలోపు గుంటూరు కారం పూర్తి కావాలంటే త్రివిక్రమ్ నిప్పుల మీద నడిచినట్టే సినిమాను వేగంగా పూర్తి చేయాలి. ఇది మామూలు టాస్క్ కాదు. వేగం మత్తులో ముందుకెలితే క్వాలిటీ పడిపోతుంది. క్వాలీటీ కోసం టైం అడిగితే ఇప్పటికే ఏడాదికి పైగా టైం వేస్ట్ చేశాడు త్రివిక్రమ్. కాబట్టి అలా టైం కావాలంటే మహేశ్ ఎగరేసి కొట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా, ఏం చేసినా.. షూటింగ్ కి మాత్రం ఇంకా నాలుగున్నర నెలలే టైం ఉంది. ఈలోగా మూవీని పూర్తి చేసి సంక్రాంతి రంగంలోకి గుంటూరు కారాన్ని దింపాల్సి ఉంటుంది. లేటైతే కంట్లో కారమే.. అదే త్రివిక్రమ్ ముందున్న అగ్నిపరీక్ష. మహేశ్‌ని మెప్పిస్తూ పూర్తి చేస్తాడా? అన్నది వన్ టూ వీక్స్‌లో ప్రోగ్రెస్‌ను బట్టి అంచనా వేయొచ్చు.