Guntur Kaaram: గుంటూరు కారం.. 9 సూపర్ అప్ డేట్స్..
గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 22న రాబోతోంది. దసరాకంటే ఒకరోజు ముందే తొలి పాటని ఫిల్మ్ టీం రివీల్ చేయబోతోంది. ఇక ఈనెల 29న మరో పాటని అది కూడా మేకింగ్ విడయోతో కలిపి రిలీజ్ చేయబోతున్నారట.

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీ 55 శాతం పూర్తైంది. ఈనెలలో మరో 15 శాతం.. అంటే కనీసం 70 శాతం షూటింగ్ అక్టోబర్ చివరాఖరిలోగా పూర్తవుతుంది. అంతవేగంగా త్రివిక్రమ్ ఈసినిమాను తెరకెక్కించటమే కాకుండా అప్‌డేట్స్ కూడా రెడీ చేస్తున్నాడు. గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 22న రాబోతోంది. దసరాకంటే ఒకరోజు ముందే తొలి పాటని ఫిల్మ్ టీం రివీల్ చేయబోతోంది. ఇక ఈనెల 29న మరో పాటని అది కూడా మేకింగ్ విడయోతో కలిపి రిలీజ్ చేయబోతున్నారట.
గుంటూరు కారం జనవరి 12న రాబోతోంది. అంటే.. ఇంకా మూడు నెలల టైం ఉంది. అయినా ఫిల్మ్ టీం మాత్రం ఇప్పటి నుంచే ప్రమోషన్‌ని ప్రారంభించబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, టీజర్స్‌తో పీక్స్‌కి తీసుకెళ్లబోతోంది. ఈనెల 22, 29న రెండు పాటలు, వచ్చేనెల 5 తేదీన మరో మేకింగ్ వీడియోని రివీల్ చేయబోతున్నారు. ఇక దీపావళికి టీజర్, నవంర్ 1 న మూడో పాట, నవంబర్ 23న నాలుగో పాటని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. విచిత్రంగా ఈ సినిమా ట్రైలర్‌ని క్రిస్మస్‌కి లాంచ్ చేయబోతున్నారు.
డిసెంబర్ ఎండింగ్‌కి ఓసాంగ్‌తో పాటు, మరో ట్రైలర్‌ని కూడా రివీల్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇలా జనవరి 12కి సినిమా రిలీజ్ అయ్యేలోపు పాటలు, మేకింగ్ వీడియోలు, టీజర్, ట్రైలర్ అంటూ మొత్తంగా 9 అప్ డేట్స్‌ని ఫిక్స్ చేసింది ఫిల్మ్ టీం.