Trivikram Srinivas: పూజా హెగ్దేను పక్కన పెట్టి.. సంయుక్తను సెట్ చేసిన గురూజీ !?
అప్పట్లో వరుసగా పూజా హెగ్దేకు అవకాశాలు ఇస్తూ, ఇప్పిస్తూ ఆమె కెరీర్‌ను పీక్స్‌కు తీసుకువెళ్లాడు గురూజీ. దీంతో ఆయన పూజతో రిలేషన్‌లో ఉన్నాడంటూ ఆప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ చాలా రోజుల నుంచి పూజ హేగ్దేకు కాకుండా సంయుక్త మీనన్‌కు వరస అవకాశాలు ఇప్పిస్తున్నాడు త్రివిక్రమ్.

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో ఆయన చుట్టూ అన్ని గాసిప్స్ కూడా ఉంటాయి. అప్పట్లో వరుసగా పూజా హెగ్దేకు అవకాశాలు ఇస్తూ, ఇప్పిస్తూ ఆమె కెరీర్‌ను పీక్స్‌కు తీసుకువెళ్లాడు గురూజీ. దీంతో ఆయన పూజతో రిలేషన్‌లో ఉన్నాడంటూ ఆప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ చాలా రోజుల నుంచి పూజ హేగ్దేకు కాకుండా సంయుక్త మీనన్‌కు వరస అవకాశాలు ఇప్పిస్తున్నాడు త్రివిక్రమ్.
ఆమెకు వచ్చే ప్రతీ ఆఫర్ వెనుక త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మహేష్‌తో త్రివిక్రమ్ చేస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా పూజను తీసేసి సంయుక్తను ఫైనల్ చేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు త్రివిక్రమ్. పూజా హెగ్దే హీరోయిన్ అని కూడా ఎనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు పూజా హెగ్దేను పక్కకు పెట్టి ఈ సినిమాలో సంయుక్తను సెట్ చేశాడు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. దీనికి గురించి ఇప్పటి వరకూ అధికారికంగా ఏ ప్రకటనా లేకపోయినా చాలా దగ్గరి సోర్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ఇది.
సంయుక్తతో త్రివిక్రమ్ క్లోజ్‌గా ఉంటున్నారని చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీనికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ సినిమాలు, ఆయనకు సంబంధం ఉన్న సినిమాల్లో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది సంయుక్త. ఇప్పుడు గుంటూరు కారంలో కూడా పూజను తీసేసి సంయుక్తను హీరోయిన్‌గా తీసుకున్న మాట నిజమే ఐతే.. ఇండస్ట్రీలో వస్తున్న గాసిప్స్ నిజమన్నట్టే లెక్క.