Guntur Karam Plop : గురూజీ కనిపించడం లేదు? గుంటూరు కారం ఫ్లాపే కారణమా..?
స్వయం ప్రకటిత మేధావి, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) హఠాత్తుగా మాయం అయిపోయారు. గుంటూరు కారం (Guntur Karam) సినిమా సంక్రాంతికి విడుదలై కలెక్షన్స్ బాగానే ఉన్నా చాలా బాడ్ టాక్ తెచ్చుకుంది. ఈ దెబ్బతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అజ్ఞాతవాసి డైరెక్టర్.

Trivikram, who is nowhere to be seen, is the reason why the hat-trick movie Guntur Karam with Mahesh Babu
స్వయం ప్రకటిత మేధావి, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) హఠాత్తుగా మాయం అయిపోయారు. గుంటూరు కారం (Guntur Karam) సినిమా సంక్రాంతికి విడుదలై కలెక్షన్స్ బాగానే ఉన్నా చాలా బాడ్ టాక్ తెచ్చుకుంది. ఈ దెబ్బతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అజ్ఞాతవాసి డైరెక్టర్. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హీరో మహేష్ బాబు (Mahesh Babu) కావలసినంత గ్యాప్ మెయింటైన్ చేశాడు. డైరెక్టర్ గురించి మాట్లాడమంటే ఆయన గురించి ఏం మాట్లాడుతాం? మా ఇంట్లో మనిషి ఆయన అని తెలివిగా తప్పించుకున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత ఒక గ్రూప్ ఇంటర్వ్యూలో మినహా త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు.
సంక్రాంతికి (Sankranti) విడుదల అవడంవల్ల, దిల్ రాజు (Dil Raju) సహకారంతో భారీగా థియేటర్లు సంపాదించడం వల్ల గుంటూరు కారానికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. సినిమా మాత్రం ఫాన్స్ నీ నిరుత్సాహ పరిస్తే సాధారణ జనానికి విసుగు తెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కుర్చీని మడత పెట్టడమేమో గాని ప్రేక్షకుల్ని మడత పెట్టేసాడని జనం జోకులేసుకుంటున్నారు. గుంటూరు కారం ప్లాప్ విషయంలో జనం మహేష్ బాబును వదిలేసారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే ఎక్కువ గురిపెట్టారు. త్రివిక్రమ్ ట్రోల్స్ తో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ దెబ్బకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మహేష్ బాబు ఇంట్లో జరిగిన గెట్ టుగెదర్ కూడా త్రివిక్రమ్ రాలేదు. ఈ ఫంక్షన్ కి హీరోయిన్ శ్రీలీల, మిగిలిన వాళ్ళంతా అటెండ్ అయ్యారు.
సినిమా సూపర్ హిట్ అని నిర్మాతలు చెప్పుకుంటున్న కనీసం సక్సెస్ మీట్ కూడా పెట్టలేదు. త్రివిక్రమ్ తాను రానని చెప్పడం వల్లనే సక్సెస్ మీట్ పెట్టలేదని తెలుస్తోంది. పండగ తర్వాత సుమ యాంకర్ గా ఇంటర్వ్యూ నిర్వహిస్తే కేవలం మహేష్ బాబు శ్రీ లీల మాత్రమే ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సహజంగా ఇలాంటి సార్ ఇలాంటి ఇంటర్వ్యూలకు కచ్చితంగా హాజరై.. తన మాటలతో, తన మేధావితనంతో చెల్రేగిపోయే త్రివిక్రమ్ అడ్రస్ లేకుండా పోయాడు. హీరో మహేష్ బాబు ని ఫేస్ చేయలాకే త్రివిక్రమ్ ఇలా తప్పించుకు తిరుగుతున్నాడని టాలీవుడ్ టాక్.