RAVITEJA: రూటు మారింది.. అల్లు అర్జున్ ప్లేస్‌లో రవితేజ..

త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేస్తున్నాడనే విషయం చాలా మంది సినీ ప్రేమికులకి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లేస్‌లోకి వేరో హీరో మూవీ వచ్చి చేరిందనే ఒక రూమర్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2024 | 04:24 PMLast Updated on: Feb 01, 2024 | 4:24 PM

Trivikram Will Do A Film With Raviteja Before Bunny Movie

RAVITEJA: త్రివిక్రమ్ తన నయా మూవీ గుంటూరు కారంతో కొంచెం వెనకపడ్డాడు. మూస పద్దతిలోనే ఆ మూవీ కథ, కథనాలు ఉన్నాయనే విమర్శలని త్రివిక్రమ్ చాలా గట్టిగానే ఎదుర్కున్నాడు. ఇప్పుడు గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు మొత్తం మహేష్ ఖాతాలోకే వెళ్తున్నాయి. ఇక పోతే త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేస్తున్నాడనే విషయం చాలా మంది సినీ ప్రేమికులకి తెలిసిందే.

Pawan Kalyan: యాత్ర2కు పోటీగా రాంబాబు.. ఏపీలో పోటా పోటీగా సినిమాలు

కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లేస్‌లోకి వేరో హీరో మూవీ వచ్చి చేరిందనే ఒక రూమర్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్‌తో సినిమా కంటే ముందు మాస్ మహారాజా రవితేజతో ఒక మూవీ చేయబోతున్నాడనే వార్తలు చాలా గట్టిగానే వినపడుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించి అంతే త్వరగా మూవీని కంప్లీట్ చేసే ప్లాన్‌లో కూడా ఉన్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్‌ని కన్ఫర్మ్ చేసారని, ఆయన అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నాడనే మాటలు కూడా వినపడుతున్నాయి. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించే ఈ నూతన చిత్రం గురించి అధికారకంగా అతి త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలని చూసిన ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా తెరకెక్కాలని కోరుకుంటున్నారు. రవితేజ ఎనర్జీకి త్రివిక్రమ్ పెన్ పంచ్ తోడైతే థియేటర్స్‌లో కొత్త రకం నవ్వులు పూయడం ఖాయమని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2కి సంబంధించిన పనులు మొత్తం కంప్లీట్ చేసుకునేలోపు త్రివిక్రమ్.. రవితేజ మూవీని కంప్లీట్ చేస్తాడని ఆ తర్వాతే బన్నీ సినిమా ఉంటుందని అంటున్నారు.