Trivikram : బన్నీ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..

టాలీవుడ్‌ (Tollywood) లో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)- అల్లు అర్జున్ (Allu Arjun) కాంబో ఒకటి. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు మూడు సూపర్ హిట్స్‌ను ప్రేక్షకులకు అందించారు. ఇక.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో మూవీపై భారీ అంచనాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 12:58 PMLast Updated on: Feb 19, 2024 | 12:58 PM

Trivikrams Master Plan For Bunny

టాలీవుడ్‌ (Tollywood) లో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)- అల్లు అర్జున్ (Allu Arjun) కాంబో ఒకటి. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు మూడు సూపర్ హిట్స్‌ను ప్రేక్షకులకు అందించారు. ఇక.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 (Pushpa2) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక.. గుంటూరు కారం సినిమా రిజల్ట్‌తో కాస్త డిజప్పాయింట్ అయిన త్రివిక్రమ్.. బన్నీతో మూవీని మరొక బ్లాక్ బస్టర్‌ హిట్‌ చేయాలన్న కసితో ఉన్నాడట. దీంతో.. బన్నీతో చేయబోతున్న నాలుగో మూవీపై నెక్స్ట్ లెవల్ ప్లానింగ్ చేస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్‌తో చేస్తున్న మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్‌ వర్గాల టాక్.. ఇక.. ఈ సినిమా స్క్రిప్ట్ పైనా త్రివిక్రమ్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నాడట.. ముఖ్యంగా బన్నీ క్యారెక్టరైజేషన్‌పై మాటల మాంత్రికుడు స్పెషల్ ఫోకస్ పెట్టాడట.. బన్నీ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని.. అందుకే, మొత్తం సినిమాలోనే బన్నీ క్యారెక్టరే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ న్యూస్‌తో మరోసారి వీరిద్దరి కాంబోలో మరో భారీ హిట్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్..

ఇక ఈ సినిమా ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి.. షూటింగ్ ను మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాలు విజయంతమైన చిత్రాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇందులో ‘అల వైకుంఠపురం’ చిత్రం అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచింది. మరి.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ రేంజ్‌లో రీచ్ అవుతుందో చూడాలి.