మ్యాన్ ఆఫ్ మాసెస్ మారకూడదు… ఆ లుక్ వెనక ఝలక్ …

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మారకూడదని తేల్చాడు దర్శకుడు. పాన్ ఇండియా లెవల్లో త్రిబుల్ ఆర్, దేవరతో దుమ్ముదులిపాడు ఎన్టీఆర్. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మల్టీస్టారరైనా, రెండోది సోలో ఎటాక్... అదే వసూళ్ల కిక్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 03:40 PMLast Updated on: Nov 14, 2024 | 3:40 PM

Twist Behind Ntr Look

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మారకూడదని తేల్చాడు దర్శకుడు. పాన్ ఇండియా లెవల్లో త్రిబుల్ ఆర్, దేవరతో దుమ్ముదులిపాడు ఎన్టీఆర్. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మల్టీస్టారరైనా, రెండోది సోలో ఎటాక్… అదే వసూళ్ల కిక్ ఇచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు మూడో పాన్ ఇండియా మూవీ వార్ 2 షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఆతర్వాతేంటనే ప్రశ్నకంటే ముందు తన లుక్ సంగతేంటనే ప్రశ్న ఎదురైంది. బేసిగ్గా హీరో ఎవరైనా, ఒక మూవీ తర్వాత మరో సినిమా చేస్తే, లుక్ మార్చాల్సిందే. పాన్ ఇండియా లెవల్లో అయితే లుక్ టెస్ట్ కంపల్సరి…కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ కి లుక్ టెస్ట్ వద్దు, లక్ టెస్ట్ వద్దని తేల్చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అలా ఉంటే చాలు… ఏమి మారకూడదు..మారాల్సిన పనిలేదు… ఇది దర్శకుడి స్టేట్మెంట్.. కమిట్ మెంట్.. ఎందుకలా అన్నాడు… మ్యాన్ ఆఫ్ మాసెస్ కి లుక్ మార్చాల్సిన పనిలేదనటానికి రీజన్ దేవరతో వచ్చిన పూనకాలేనా..?

ఎన్టీఆర్ తన కెరీర్ లో యమదొంగ టైంలో సన్నబడ్డాడు…టెంపర్ మూవీ వరకొచ్చేసరికి సాలిడ్ మజిలర్ లుక్ లోకిక్ ఇచ్చాడు.కట్ చేస్తే, అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో షాక్ ఇచ్చాడు. ఇక త్రిబుల్ ఆర్ లో కొమరం భీం పాత్రకు తగ్గ కండలతో, పులి మీదకే పంజా వేసే యోధుడిగా లుక్ తో ఝలక్ ఇచ్చాడు.. కథ కనెక్ట్ అయితే, పాత్రలో పాతుకుపోయేందుకు ఎంత రిస్కైనా చేసే ఎన్టీర్ ఇక మారాల్సిన పనిలేదన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్

ఇది చాలా బిగ్ స్టేట్ మెంట్… ఇంతవరకు ఆ దర్శకుడు ఏ హీరో లుక్ మీద కామెంట్ చేయలేదు. కేజీయఫ్ లో రాఖీ భాయ్ లుక్ ని డిసైడ్ చేసింది తానే.. సలార్ లో ప్రభాస్ లుక్ ని మార్చింది కూడా తనే.. కాని డ్రాగన్ లో మాత్రం ఎన్టీఆర్ తన లుక్ మార్చుకోవాల్సిన పనిలేదని తేల్చాడు.. తను కనీసం బయటికి చెప్పాడు.. హిందీదర్శకుడు అలా చెప్పకుండానే, ఎన్టీఆర్ తో వార్ 2 మూవీ తీస్తున్నాడు.

నిజానికి దేవర మూవీ రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ లుక్ ని నార్త్ ఇండియాలో చాలా మంది కామెంట్ చేశారు. దేవర పాత్ర భయంకరంగా డిజైన్ చేశారు. కాని ఎన్టీఆర్ ఆ పాత్ర బరువు మోయటమే కష్టమన్నారు. మొదటి రోజు కాదు, ఈసినిమా విడుదలైన వారం రోజులు ఇలాంటి కామెంట్లే వినిపించాయి.

కాని దేవరలో ఎన్టీఆర్ పెర్పామెన్స్ తన గాంభిర్యం ఏరేంజ్ లోనార్త్ ఇండియన్స్ కి ఎక్కిందంటే, సౌత్ కంటే దేవరకి నార్త్ లో మరింత వసూళ్లు రావటానికి తన లుక్కే కారణమౌైంది. అందుకు తగ్గ పెర్ఫామెన్స్ కూడా తోడైంది.. మాస్ కాదు ఊర మాస్ కి కూడా కనెక్ట్ అయ్యే రేంజ్ లుక్ తో కిక్ ఇచ్చాడు తారక్. అదే హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీకి నచ్చింది.. కాబట్టే వార్ 2లో అదే లుక్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎన్టీఆర్ పెద్దగా తన లుక్ మార్చుకోకుండానే ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు

ఆతర్వాత ఫిబ్రవరిలో మొదలయ్యే ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ కోసం కూడా ఎన్టీఆర్ కొత్తగా లుక్ మార్చుకునే పనిలేదట. తన ప్రజెంట్ అప్పియరెన్సే మాస్ మతిపోగొట్టేందుకు చాలట… అందుకే లుక్ టెస్ట్ అని, అదని, ఇదని ఏది మార్చాల్సిన పనిలేదన్నాడు. వార్ 2 షూటింగ్ అయిపోయిన రెండువారాలకే ఫిబ్రవరిలో డైరెక్ట్ గా డ్రాగన్ రెగ్యులర్ షూట్ ప్లాన్ చేశాడు.