బాలయ్యతో రెండు సినిమాలు, అనిరుద్ బ్యాక్ టూ బ్యాక్
టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లో కథ ఎలా ఉన్నా సరే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లో కథ ఎలా ఉన్నా సరే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య సినిమాల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లలో స్పీకర్లను తగలబెట్టేస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలయ్య సినిమాల కోసం ప్రాణం పెట్టడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తమన్ దీనికి సంబంధించి చేస్తున్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయింది. కొన్ని చోట్ల స్పీకర్లు కూడా కాలిపోవడం సెన్సేషన్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా అఖండ సీక్వెల్ కు తమన్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా దసరా టైంకి రిలీజ్ చేయాలని డైరెక్టర్ బోయపాటి పట్టుదలగా ఉంటే ఇక తమన్ కూడా మ్యూజిక్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకొని కొడుతున్నాడు. ఇప్పటికే రెండు పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ ఎలివేషన్స్ విషయంలో ఫోకస్ పెట్టాడు.
మహాకుంభమేళాలో జరిగిన షూటింగ్లో తమన్ మ్యూజిక్ కచ్చితంగా హైలైట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. అయితే ఈ టైంలో బాలయ్య సినిమాలకు మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంటర్ అవుతున్నాడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నందమూరి బాలయ్య కు వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సీక్వెల్ కోసం అనిరుద్ వర్క్ చేస్తున్నాడు. దాదాపుగా ఈ వర్కు కొంత కంప్లీట్ చేశాడు. ఇక వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్యతో హిట్టు కొట్టిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు.
ఈ ఏడాది జూన్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. అఖండ సీక్వెల్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమాను లైన్లో పెట్టడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్. ఇక జైలర్ సీక్వెల్ లో కూడా బాలయ్య ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కూడా అనిరుద్ సంగీతం అందించడంతో బాలయ్య సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయడం సెన్సేషన్ అవుతుంది. తెలుగులో దేవర సినిమాతో అడుగుపెట్టిన అనిరుద్ బాలీవుడ్ లో కూడా ఇప్పటికే ఒక సక్సెస్ కొట్టాడు. ఇక బాలకృష్ణ సినిమాతో భారీ హిట్టు కొట్టి తెలుగులో వరుస ప్రాజెక్టులను టేకప్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు.