రెండు సాంప్రదాయాలు, రెండు మతాలు, కీర్తి వింటేజ్ మ్యారేజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సినీ, వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 11:54 AMLast Updated on: Dec 03, 2024 | 11:54 AM

Two Traditions Two Religions A Vintage Marriage Of Fame

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సినీ, వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు కొందరు వ్యాపారవేత్తలు ఈ వివాహానికి హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పెళ్లి చేసుకుని కెరీర్ లో ముందుకు వెళ్లాలని కీర్తి సురేష్ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఆశ్చర్యంగా అనిపించినా కీర్తి మాత్రం ఈ విషయంలో కాస్త పక్కగానే ముందుకు వెళ్తోంది.

గతంలో కంటే ఇప్పుడు కీర్తి కాస్త డిఫరెంట్ గా కనబడే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో స్కిన్ షో ని తీవ్రంగా వ్యతిరేకించిన కీర్తి సురేష్ ఇప్పుడు స్కిన్ షో విషయంలో ఏమాత్రం కూడా రాజీపడటం లేదు. ఇక దీనికి తనకు కాబోయే భర్త కూడా అంగీకారం తలపడంతో కీర్తి కాస్త జోష్ మీద ఉంది. ఇప్పుడు కీర్తి సురేష్ వివాహంపై సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రూమర్లు షికారు చేస్తున్నాయి. ఈ వివాహం ఎలా జరగబోతుంది ఏంటి అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

హిందూ క్రిస్టియన్ సాంప్రదాయంలో ఈ వివాహాన్ని జరపనున్నట్లుగా సమాచారం. ఆంటోనీ క్రిస్టియన్ కావడం అలాగే కీర్తి సురేష్ హిందూ కావడంతో ఈ వివాహాన్ని రెండు మతాల్లో జరిపేందుకు సిద్ధమయ్యారు. గోవాలో ఇప్పటికే ఓ ప్రముఖ చర్చిలో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. అలాగే గోవాలో ఒక ప్రముఖ స్టూడియోలో ఈ వివాహం సెట్ వేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖనను సినీ ప్రముఖులకు అందించనున్నారు.

10న ప్రీ వెడ్డింగ్, 11 న సంగీతం, 12 ఉదయం కీర్తి మేడలో తాళి కట్టనున్నాడు. మూడు రోజుల పాటు వివాహం జరగనుంది. అదే రోజు సాయంత్రం చర్చిలో క్రీస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ప్లాన్ చేసారు. క్రీస్టియన్ మ్యారేజ్ కు మాత్రం అతి తక్కువ మంది హాజరు కానున్నారు. ఇటీవల తిరుమల వెళ్లిన కీర్తి సురేష్ తాను వివాహం చేసుకోబోతున్నానని… డిసెంబర్ 12వ తారీఖున వివాహం చేసుకున్నట్లుగా ప్రకటించింది. ఇక ఈ వివాహానికి తెలుగులో రానా దగ్గుపాటి అలాగే హీరో నాని సహా అతి తక్కువ మంది హాజరుకానున్నారు.

అలాగే కన్నడ సినిమా నుంచి కూడా తక్కువ మంది ప్రముఖులనే కీర్తి సురేష్ ఆహ్వానించినట్లు సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి వివాహం చేసుకుని తర్వాత కొన్నాళ్లకు సినిమాలపై ఫోకస్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేసే అవకాశం లేదని ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులను మాత్రమే ఫినిష్ చేసే అవకాశం ఉండవచ్చని సినీవర్గాలు అంటున్నాయి. ఆమె సినిమా కెరీర్ పై తమిళ మీడియాలో ఎన్నో ఊహగానాలు అభిమానుల హార్ట్ బీట్ పెంచుతున్నాయి.