అల్లు అర్జున్ కారణంగా స్టార్ అయిన ఉదయ్ కిరణ్.. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ బాసు ఇది..!

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి. అలా ఉదయ్ కిరణ్ లైఫ్ లో కూడా 2001లో ఒక విచిత్రం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2025 | 11:30 AMLast Updated on: Apr 05, 2025 | 11:30 AM

Uday Kiran Became A Star Because Of Allu Arjun This Is A Very Interesting Story Boss

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి. అలా ఉదయ్ కిరణ్ లైఫ్ లో కూడా 2001లో ఒక విచిత్రం జరిగింది. దానికి కారణం అల్లు అర్జున్. అదేంటి.. అల్లు అర్జున్ సినిమాలోకి వచ్చింది 2003లో.. అప్పటికే ఉదయ్ కిరణ్ స్టార్ హీరో.. ఈ ఇద్దరికి ఎక్కడ లింకు కుదిరింది అనుకోవచ్చు. అందుకే చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీ అనేది చాలా విచిత్రం.. ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టే ఉంటుంది కానీ.. నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో జరిగే ఒక మూమెంట్.. ఇంకెక్కడో మరొకరి జీవితాన్ని మార్చేస్తుంది. అలా అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం ఉదయ్ కిరణ్ ను స్టార్ గా మార్చేసింది. కొరియన్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు ఉంది కదా.. ఇప్పుడు ఈ విషయాన్ని చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటంటే 2001లో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాడు బన్నీ. అందులో చిరంజీవి దగ్గర డ్యాన్స్ నేర్చుకునే ఒక కుర్రాడిగా కనిపిస్తాడు అల్లు అర్జున్.

కథను మలుపు తిప్పే పాత్ర అది. బన్నీకి యాక్సిడెంట్ కావడం.. తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పెట్టి అతనికి సర్జరీ చేయించడం.. అక్కడి నుంచి డాడీ కథ మలుపు తీసుకోవడం జరుగుతుంది. అయితే డాడీ సినిమా చేస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ ను చూసాడు దర్శకుడు తేజ. అప్పటికి చిత్రం సినిమా తీసి మంచి ఊపు మీద ఉన్నాడు ఆయన. నువ్వు నేను కథ రాసుకుంటున్నాడు. డాడీ సినిమా చూసిన తర్వాత తాను రాసుకున్న కథకు బన్నీ అయితే బాగుంటాడు అని అల్లు అరవింద్ ను వెళ్లి అడిగాడు తేజ. కానీ తాము ఇప్పుడే బన్నీని హీరోగా పరిచయం చేయట్లేదు అని చెప్పేసరికి.. అదే కథను మాధవన్ కు చెప్పాలని ట్రై చేశాడు. కానీ మాధవన్ కూడా తెలుగు సినిమాలు తనకు చేసే ఉద్దేశం లేదు అని చెప్పడంతో.. ఆ ప్రాజెక్టు లోకి ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి చిత్రం సినిమా హిట్ అయినా కూడా.. ఉదయ్ కు రావాల్సిన గుర్తింపు రాలేదు. నువ్వు నేను సినిమాతోనే ఈయన స్టార్ అయ్యాడు.

ఆ వెంటనే మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి సినిమాలతో ఊహించని హైట్స్ కు వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. ఈ సీన్ మొత్తంలో ఒక్కసారి అల్లు అర్జున్ నువ్వు నేను సినిమా చేసి ఉంటే ఉదయ్ కు ఆ రేంజ్ స్టార్ డమ్ వచ్చేది కాదు. అందుకే బన్నీ కారణంగా ఉదయ్ కిరణ్ స్టార్ట్ అయ్యాడు అనేది. నువ్వు నేను సినిమా వద్దు అనుకున్న తర్వాత.. రెండేళ్లకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆయన కెరీర్ ఎలా ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఉదయ్ కిరణ్ కెరీర్ ఊహించని విధంగా డౌన్ ఫాల్ అయింది. దానికి కారణం అందరికీ తెలిసిందే అయినా తెలియనట్టే ఉంటారు.