Pushpa2 : అండర్ వాటర్ సీక్వెన్స్ పక్కా..

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో పుష్ప-2 ఒకటి.. పార్ట్ -1 బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టడంతో.. పార్ట్ -2 కోసం కంట్రీ వైడ్ బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 1, 2024 | 11:00 AMLast Updated on: May 01, 2024 | 11:00 AM

Underwater Sequence In Pan India Movie Pushpa 2

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో పుష్ప-2 ఒకటి.. పార్ట్ -1 బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టడంతో.. పార్ట్ -2 కోసం కంట్రీ వైడ్ బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పుష్ప -1 సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటు సాంగ్స్, బన్నీ మేనరిజం వైరల్ అవ్వడం, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు ఇప్పటికే రిలీజైన పుష్ప 2 గ్లింప్స్ సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి. ఇలాంటి టైమ్‌లో మూవీ నుంచి వస్తున్న లేటెస్ట్ అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌ను నేల మీద నిలవనీయడం లేదు.. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి వినిపిస్తోన్న లేటెస్ట్ బజ్ బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

పుష్ప-2కు ఉన్న మానియా కారణంగా ఇప్పటికే ఈ మూవీకి భారీగా బిజినెస్ జరుగుతోంది. ఇక మూవీలో డైరెక్టర్ సుకుమార్ భారీ సీక్వెన్స్‌లు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు లీకయ్యాయి. వీటన్నింటిలోనూ జాతర స్వీక్వెన్స్‌ మూవీకి హైలెట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. దీనిని లేటెస్ట్ టీజర్ లో కూడా మేకర్స్ చూపించారు. ఇందులో బన్నీ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కాగా.. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ని తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా ఛాయాగ్రాహకులు కూబా కన్ఫర్మ్ చేశారు.

గతంలో పుష్ప 1 కి ఓ బోట్ సీక్వెన్స్ నీటిలో ఉంటుంది అని టాక్ వచ్చింది. కానీ అది సినిమాలో లేదు.. కానీ ఈసారి మాత్రం పుష్ప-2 లో ఆ సీక్వెన్స్ ఉంటుందని కూబా సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సీన్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలంటూ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక.. రెండో భాగంపై ఉన్న హైప్ దృష్ట్యా అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేసే విషయంలో దర్శక, నిర్మాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడంతో పాటు పుష్ప 2 బెంగాలీలో కూడా విడుదల కానుందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.