Sridevi: మిస్‌ యూ శ్రీదేవి.. శ్రీదేవి గురించి ఎవరికీ తెలియని నిజాలు!

దాదాపు 5 దశాబ్ధాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ అతిలోక సుందరి.. 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తన అభిమానులను శోకసంద్రంలో ముంచారు. తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి గురించి ఎవరికీ ఎక్కువగా తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2023 | 06:46 PMLast Updated on: Feb 23, 2023 | 6:46 PM

Unknown Facts About Actror Sridevi

శ్రీదేవి (Sridevi) అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది ఆమె అందం, అభినయం, హీరోలతో సమానమైన స్టార్‌డమ్. ఫ్యాన్స్‌కే కాదు స్టార్‌ హీరోలకు కూడా శ్రీదేవి డ్రీమ్‌గల్‌. దాదాపు 5 దశాబ్ధాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ అతిలోక సుందరి.. 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తన అభిమానులను శోకసంద్రంలో ముంచారు. తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి గురించి ఎవరికీ ఎక్కువగా తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది అనుకున్నట్టు శ్రీదేవి అసలు పేరు శ్రీదేవి కాదు. ఆమె రియల్‌ నేమ్‌ శ్రీ అమ్మా యాంగర్‌. సినిమాల్లోకి వచ్చిన తరువాత చాలా మంది స్టార్స్‌ మాదిరిగానే ఆమె కూడా తన పేరును శ్రీదేవిగా మార్చుకున్నారు. డే బై డే స్టార్‌గా ఎదుగుతున్నకొద్దీ అంతా శ్రీ అమ్మా యాంగర్‌ను మార్చిపోయి శ్రీదేవిని మాత్రం గుర్తు పెట్టుకున్నారు.

1979 లో సోల్వా స్వాన్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. నిజానికి నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1969 లో ఎంఏ తిరుముగామ్ డైరెక్షన్‌లో వచ్చిన తునైవాన్‌ శ్రీదేవి మొదటి సినిమా. ఈ సినిమాలో శ్రీదేవి మురుగన్‌ పాత్రలో నటించారు.

5 దశాబ్ధాల్లో మొత్తం 300 సినిమాల్లో నటించారు శ్రీదేవి. ఇండియాలో చాలా తక్కువ మంది స్టార్స్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు. తన లాస్ట్‌ సినిమా ‘మామ్‌’కు ఉత్తమ నటిగా శ్రీదేవికి నేషనల్‌ అవార్డ్‌ లభించింది. కానీ అప్పటికే శ్రీదేవి చనిపోయారు.

నార్త్‌లో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవికి మొదట్లో హిందీ మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదట. అందుకే ఆమె సినిమాలకు ఎక్కువగా రేఖ డబ్బింగ్‌ చెప్పేవారు. రేఖ తరువాత చాంద్‌.. శ్రీదేవికి ఎక్కువగా డబ్బింగ్‌ చెప్పారు. 1989 లో వచ్చిన చాందిని సినిమా నుంచి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం ప్రారంభించారు శ్రీదేవి.

ఇండియాలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి. నాలుగేళ్ల వయసులో యాక్టింగ్‌ ప్రారంభించిన శ్రీదేవి 300 సినిమాల్లో నటించారు. దాదాపు 5 దశాబ్ధాల పాటు స్టార్‌గా కొనసాగారు. సినీ ఇండస్ట్రీలో లాంటి ఘనత సాధించడం కేవలం శ్రీదేవికి మాత్రమే సాధ్యమైంది.

1985 నుంచి 1992 వరకూ హైఎస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకున్న ఏకైక హీరోయిన్‌గా శ్రీదేవి కొనసాగారు. ఆ కాలంలోనే ఆమె ఒక సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తీసుకునేవారు. అప్పట్లో కారావాన్‌ ఉన్న ఏకైక హీరోయిన్‌ శ్రీదేవి. ఈ కారావాన్‌ను గ్రామాల్లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో బట్టలు మార్చుకునేందుకు శ్రీదేవి ఉపయోగించేవారు.

వర్క్‌ విషయంలో శ్రీదేవికి ఉన్న డెడికేషనే ఆమెను టాప్‌ ప్లేస్‌లో నిలబెట్టిందని శ్రీదేవితో వర్క్‌ చేసిన చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. 1989లో వచ్చిన చల్‌బాజ్‌ మూవీలో ఓ సాంగ్‌ షూట్‌ చేస్తున్న సమయంలో శ్రీదేవికి 103 ఫారన్‌హీట్స్‌ ఫీవర్‌ ఉందట. అంత టెంపరేచర్‌తో కూడా శ్రీదేవి షూటింగ్‌ కంప్లీట్‌ చేశారట. వర్క్‌ పట్ల ఆమెకు ఉన్న కమిట్‌మెంట్‌కు ఇది చిన్న ఎగ్జాపుల్‌ అని చెప్తుంటారు ఆమె కోస్టార్స్‌.

1976లో వచ్చి మూండ్రు ముడిచ్చు అనే సినిమాలో రజినీకాంత్‌ సవతి తల్లిగా నటించారు శ్రీదేవి. రజినీకాంత్‌ టాప్‌ 10 సినిమాల్లో మూండ్రు ముడిచ్చు అగ్రస్థానంలో ఉంటుంది. నిజానికి ఈ సినిమా చేసినప్పుడు శ్రీదేవి వయసు 13 ఏళ్లు. రజినీకాంత్‌ వయసు 26 ఏళ్లు. తన వయసుకు రెట్టింపు వయసున్న హీరోకు కూడా తల్లిపాత్ర చేసింది శ్రీదేవి. ఈ అతిలోక సుందరి తప్ప ఇలాంటి సాహసం మరే హీరోయిన్‌ చేసేది కాదు అంటుంటారు క్రిటిక్స్‌.

శ్రీదేవి టాలెంట్‌ బాలీవుడ్‌తో ఆగిపోలేదు. హాలీవుడ్‌ నుంచి కూడా శ్రీదేవికి ఆఫర్లు వచ్చాయి. వరల్డ్‌ ఫేమస్‌ డైరెక్టర్‌ స్పీల్‌ బర్గ్‌.. తన జురాసిక్‌ పార్క్‌ సినిమాలో ఓ రోల్ చేయమని శ్రీదేవిని అడిగారట. కానీ ఎక్కువ కాలం ఇండియన్‌ సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడం, స్పీల్‌బర్గ్‌ ఇచ్చిన పాత్ర తనకు సూట్‌ కాదని భావించడంతో ఆ సినిమాను శ్రీదేవి రిజెక్ట్‌ చేశారట.

శ్రీదేవి మోస్ట్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ మాత్రమే కాదు. మంచి పేయింటర్‌ కూడా. సావరియా సినిమాలోని సోనమ్‌ కపూర్‌ స్టిల్‌ను శ్రీదేవి పెయింటింగ్‌ వేశారు. ఈ పెయింటింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీనికి వేలంపాట నిర్వహించేందుకు కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. యాక్టర్‌ మోహిత్‌ మార్వాహ్‌ పెళ్లి తరువాత ఈ పెయింటింగ్‌కు ఆక్షన్ జరగాల్సి ఉంది. కానీ ఈ గ్యాప్‌లోనే శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవి నిజానికి సింగర్‌ కూడా. చాందిని, క్షణక్షణం, గర్జణ లాంటి సినిమాల్లో శ్రీదేవి పాటలు పాడారు.

యాక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు శ్రీదేవి. 2002లో తన ఓన్‌ ప్రొడక్షన్‌లో షారుఖ్‌ ఖాన్‌తో ఓ శక్తి అనే సినిమా చేశారు. శ్రీదేవి ఓన్‌ బ్యానర్‌ ‘శ్రీదేవి ప్రొడక్షన్స్‌’లో ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమాలో శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ అప్పుడు తన రెండో కూతురు కౌశి కపూర్‌ కడుపులో ఉండటంతో శ్రీదేవి నటించలేదు.

శ్రీదేవికి సినిమాలే ప్రాణం అని చెప్పేందుకు ఆమె కూతుళ్ల పేర్లే ఎగ్జాంపుల్‌. కూతుళ్లకు జాన్వీ, కౌశి అని పెట్టడానికి ఆమె జీవితంలోని రెండు సినిమాలు కారణం. బోనీకపూర్ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘జుడాయి’ సినిమాలో హీరోయిన్‌ ఊర్మిళ పాత్ర పేరు జాన్వీ, ఇక ‘హమారే దిల్‌ ఆప్‌కే పాస్‌ హై’ అనే సినిమాలో హీరోయిన్‌ సొనాలి పేరు కౌశి. ఈ పేర్లనే శ్రీదేవి తన కూతుళ్లకు పెట్టుకున్నారు.