ఓవర్సీస్ లో ఆగని డాలర్ల వర్షం.. తండెల్ కు లాభాలే లాభాలు

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తండేల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో నాగచైతన్య తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. డైరెక్టర్ చందు మొన్దేటి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విధానానికి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2025 | 05:59 PMLast Updated on: Feb 09, 2025 | 5:59 PM

Unstoppable Dollar Rain Overseas Profits Are Profits For Tandel

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తండేల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో నాగచైతన్య తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. డైరెక్టర్ చందు మొన్దేటి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విధానానికి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక సినిమాకు రిలీజ్ అయిన దగ్గరనుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో.. పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను కొంతమంది టార్గెట్ చేసిన సరే.. రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా భారీగానే కలెక్ట్ చేస్తుంది.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా రిలీజ్ కి ముందే దాదాపు రెండు లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగచైతన్య కెరియర్ లో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాపై నాగచైతన్యతో పాటుగా అల్లు అరవింద్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆయన ప్లాన్ చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు అల్లు అరవింద్.

ఇప్పుడు సక్సెస్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన సాయి పల్లవి సినిమాకు కంప్లీట్ గా ప్లస్ అయిందని చెప్పాలి. ఆమె డాన్స్ ఆమె యాక్షన్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోతూ ఉంటారు. సినిమా కథ ఎలా ఉన్నా సరే సాయి పల్లవి యాక్షన్ కచ్చితంగా కలిసి వస్తుంది. అందుకే అల్లు అరవింద్ కూడా ఏరి కోరి సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. ప్రమోషన్స్ లో కూడా సాయి పల్లవి చాలా బాగా హెల్ప్ చేయడం సినిమాకు మరింతగా అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి.

ఇంకా నాగచైతన్య కెరీర్ లో ఈ సినిమా కచ్చితంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించే తొలి సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది. ఓటిటి ప్లాట్ఫామ్స్ కూడా ఈ సినిమాపై భారీగానే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ముందుగా కొంతమంది కొనుక్కోవడానికి వచ్చిన సరే అల్లు అరవింద్ మాత్రం అమ్మడానికి ఇష్టపడలేదు. సినిమా రిజల్ట్ తర్వాత భారీ ధర వచ్చే అవకాశం ఉండటంతో అల్లు అరవింద్ వెయిట్ చేశారు. ఇక ఈ సినిమా అమెరికాలో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. అమెరికాలో భారీగా వసూళ్లు సాధిస్తున్న సినిమాగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల డాలర్లు అమెరికా మార్కెట్లో వసూలు చేసింది తండేల్. అమెరికాలోనే రిలీజ్ కి ముందు దాదాపు రెండు లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా.. లాంగ్ లో ఖచ్చితంగా వన్ మిలియన్ మార్క్ అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పట్లో మరో సినిమా లేకపోవడంతో తెలుగు ఆడియన్స్.. ఓవర్సీస్ లో గట్టిగానే ఎంజాయ్ చేస్తున్నారు.