బాలయ్య దారుణంగా వాడుతున్న అల్లు అరవింద్… మరీ ఈ రేంజ్ లోనా…?
ఆహా ప్లాట్ ఫాంపై నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ను ఇప్పుడు సినిమా వాళ్ళు ఓ రేంజ్ లో వాడుకోవడం మొదలుపెట్టారు. ఏ సినిమా ప్రమోషన్ అయినా సరే అన్ స్టాపబుల్ లో జరగాల్సిందే అన్నట్లు ఉంది.
ఆహా ప్లాట్ ఫాంపై నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ను ఇప్పుడు సినిమా వాళ్ళు ఓ రేంజ్ లో వాడుకోవడం మొదలుపెట్టారు. ఏ సినిమా ప్రమోషన్ అయినా సరే అన్ స్టాపబుల్ లో జరగాల్సిందే అన్నట్లు ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఈ షోలో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కూడా అల్లు అర్జున్ ఇక్కడే చేసాడు. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వచ్చిన కంగువ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ షో లోనే కంప్లీట్ చేశారు.
ఆ ఎపిసోడ్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడే జరిగింది. ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. వెంకటేష్, బాలకృష్ణ మాట్లాడుకున్న మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక వెంకటేష్ కూడా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే వెంకటేష్ సోదరుడు దగ్గుపాటి సురేష్ బాబు కూడా ఈ షో కి వచ్చారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోలో పాల్గొన్నారు.
త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్న ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నారు. రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఎప్పటి నుంచో రాంచరణ్ వస్తాడని భావించినా… అది లేట్ అయింది. ఇప్పుడు రావడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజు సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు. త్వరలోనే దిల్ రాజు కూడా అన్ స్టాపబుల్ లో మెరిసే అవకాశం కనబడుతోంది. త్వరలోనే హీరో నాని అలాగే రామ్ ఇద్దరు ఈ షో కి రానున్నారు.
నాని నటించిన హిట్ 3 ఈ ఏడాది రిలీజ్ కానుంది. చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరా సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడే చేయనున్నారు. ఇప్పటికే వెంకటేష్ ఎపిసోడ్ సూపర్ హిట్ కావడంతో రామ్ చరణ్ ఎపిసోడ్ పై ఓ రేంజ్ అంచనాలన్నాయి. రామ్ చరణ్ కు ప్రభాస్ కు మధ్య ఫోన్ కాల్ ఉండే ఛాన్స్ ఉంది. గతంలో ప్రభాస్ ఈ షోలో పాల్గొన్న సమయంలో రామ్ చరణ్ తో ఫోన్ కాల్ మాట్లాడాడు. అది ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. రామ్ చరణ్ తో బాలకృష్ణ కూడా కాస్త క్లోజ్ గానే ఉంటారు. దీనితో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనేదానిపై అభిమానులు ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి కూడా ఈ షోకి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే రామ్ చరణ్ తో పాటుగా దిల్ రాజు కూడా వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దిల్ రాజుకి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇవ్వటంతో ఆయన వస్తే ఎటువంటి కామెంట్స్ చేస్తారని దానిపై కూడా చర్చ జరుగుతోంది.