Upasana : హీరోయిన్ గా ఉపాసన… మిస్ చేసుకున్న మూవీ ఇదే..!
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనువరాలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది ఉపాసన. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన ఉపాసన.. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనువరాలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది ఉపాసన. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన ఉపాసన.. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతోంది. మరికొన్ని వ్యాపారాల్లోనూ తన మార్క్ వేసుకుంటూ దూసుకుపోతోంది. చెర్రీ భార్యగా, క్లీంకార తల్లిగా వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంది. అయితే ఉపాసనకి సంబంధించి ఓ ఇట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..ఉపాసన మొదట్లో హీరోయిన్ అవ్వాలనుకుందట. ఆ టైమ్ లోనే ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. ఆ మూవీ ఏంటో తెలుసా..’చిరుత’
Puri Jagannath : అప్పుడు పవన్, మహేశ్, చరణ్, ప్రభాస్ కోసం ఇప్పుడు రామ్ కోసం ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిరుత.. చెర్రీకి ఫస్ట్ మూవీ. ఇందులో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ 2007లో విడుదలై సూపర్ హిట్టైంది. ఈ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్.. ఉపాసనని తీసుకుందాం అనుకున్నారట. అప్పటికే ఆమెకు ఇండస్ట్రీలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంది కానీ.. ఆఫర్ మాత్రం రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీ తమకు కలసిరాదని.. బిజినెస్ రంగంలోనే ఉన్నత స్థానానికి చేరుకోవాలని పేరెంట్స్ చెప్పారట. అందుకే ఉపాసన హీరోయిన్ అవ్వాలనుకున్నా ఆ ఆలోచనను విరమించుకుని అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంది. అలా రియల్ కపుల్..ఉపాసన-చెర్రీ కాంబోలో రావాల్సిన మూవీ మిస్సైంది.
పదేళ్ల క్రితం రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్న ఉపాసన.. రీసెంట్ గా బేబీకి జన్మనిచ్చింది. క్లీంకార ఎంట్రీతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవు. మొన్నటి వరకు బిజినెస్ విమెన్ గా, భార్యగా బాధ్యతలు నిర్వహించిన ఉపాసన.. ఇప్పుడు తల్లిగా క్లీంకార బాధ్యతలు కూడా సమర్థవతంగా నిర్వహిస్తోంది. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె బిజీ బిజీగా ఉంటారు. సోషల్ మీడియా లో కూడా ఉపాసనకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనా హీరోయిన్ గా చెర్రీతో నటించే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నావ్ అంటూ కొందరు.. ఉపాసన ఏ నిర్ణయం తీసుకున్నా పర్ ఫెక్ట్ అంటూ మరికొందరు..ఇది నిజమేనా అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి మరి..