Ram Charan: క్లీన్‌కారాను మొదటిసారి చూపించిన ఉపాసన
రామ్‌చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారా ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయ్.

Upasana posted photos of her daughter Klinkara on social media
రామ్‌చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారా ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయ్. క్లింకారా ఫోటోలను ఉపాసన అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఉపాసన హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడైనా.. బారసాల నాడైనా క్లింకారా మొహాన్ని చూపించలేదు. ఐతే ఇప్పుడు తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి క్లింకారా ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్‌లో పాల్గొంది. క్లింకారా తన చిట్టి చేతులతో జెండావందనం చేసినట్టుగా ఉంది. ఉపాసన తల్లిదండ్రులు క్లింకారాతో కనిపిస్తున్నారు. ఈ క్షణాలు ఎంతో విలువైనవి.. క్లింకారా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్.. అమ్మమ్మ తాతయ్యలతో క్లింకారా ఉందంటూ ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
క్లింకారా పూర్తి మొహాన్ని మాత్రం ఇంత వరకు ఉపాసన బయటకు చూపించలేదు. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోల్లోనూ మొహం కాస్తే కనిపిస్తోంది. అమ్మమ్మ చేతుల్లో క్లింకారా ఉంది. జెండా వందనం చేస్తున్నట్టుగా తాడుని పట్టుకుని ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఉపాసన పెట్టిన కామెంట్, షేర్ చేసిన ఫోటోలకు మెగా అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. తల్లి అయిన తరువాత తనలో ఎంతో మార్పు వచ్చిందని, తన ప్రపంచమే మారిపోయిందని ఉపాసన చెప్తోంది. తల్లి అయిన తరువాతే మాతృత్వం గొప్పదనం అర్థమైందని.. అందుకే ఒంటరి తల్లులకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తోందని, అందుకే సింగిల్ మదర్స్‌కు, పిల్లలకు ఉచితంగా చికిత్స అందించాలని, ఎలాంటి ఓపీ ఖర్చులు లేకుండా అపోలో తరుపున వైద్యం చేయిస్తానని ఉపాసన ప్రకటించింది.