Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ఐటం గర్ల్‌గానే మిగిలిపోయిందా..?
ఊర్వశి రౌతెలా హాట్ బ్యూటీనే. అయినా, హీరోయిన్‌గా ఛాన్సులివ్వరు. యువ హృదయాలను అందంతో కోసేసినా.. ఆఫర్స్ పెద్దగా లేవు. మంచి డ్యాన్సర్ అన్న ముద్రతో తెలుగులో వరుస ఐటంసాంగ్స్‌తో ఎక్కువ ఫేమస్ అయింది ఊర్వశి. ఐటంగర్ల్‌గా పొట్టి పొట్టి డ్రెస్సులతో కనిపిస్తుందేగానీ, సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే.
Urvashi Rautela: ఒక్క హిట్‌తో తెలుగులో ఐటంసాంగ్స్ అన్నింటినీ వెనకేసుకుంది ఊర్వశి రౌతెలా. స్టార్ హీరో.. యంగ్ హీరో.. అనే తేడా లేకుండా అందరూ ఈ అమ్మడి వెనకాలే పడ్డారు. అయితే.. ఫ్లాప్ ముద్ర ఈ అమ్మడిని ఇబ్బంది పెడుతోంది. ఐటంసాంగ్ చేసిన కొత్త సినిమా హిట్ కాకపోతే ఈ బోల్డ్ బ్యూటీ పరిస్థితి ఏంటి..? ఊర్వశి రౌతెలా హాట్ బ్యూటీనే. అయినా, హీరోయిన్‌గా ఛాన్సులివ్వరు. యువ హృదయాలను అందంతో కోసేసినా.. ఆఫర్స్ పెద్దగా లేవు. మంచి డ్యాన్సర్ అన్న ముద్రతో తెలుగులో వరుస ఐటంసాంగ్స్‌తో ఎక్కువ ఫేమస్ అయింది ఊర్వశి.
ఐటంగర్ల్‌గా పొట్టి పొట్టి డ్రెస్సులతో కనిపిస్తుందేగానీ, సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. వాల్తేరు వీరయ్యలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌లో కనిపించేది కొంచెంసేపే అయినా రూ.30 లక్షలకుపైగా డిమాండ్ చేసిందని టాక్. సినిమా హిట్ కావడంతో తెలుగులో ఐటంసాంగ్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. వరుసపెట్టి ఏజెంట్, బ్రో మూవీల్లో తళుక్కున మెరిసింది రౌతేలా. హిట్ ఐటంగర్ల్ ఊర్వశి కాస్తా.. రాను రాను ఐరన్‌లెగ్ అయిపోయింది. మూడు సినిమాలు చేస్తే.. వాల్తేరు వీరయ్య తప్ప.. బ్రో, ఏజెంట్ నిరాశపరచడంతో ఈ అమ్మడిపై ఫ్లాప్ ముద్ర పడింది. ఆరు నెలల క్రితం రామ్, బోయపాటి మూవీ స్కందలో ఓ ఐటంసాంగ్ చేసింది తప్పితే మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో మరిన్ని ఐటంసాంగ్స్ రావాలంటే.. స్కంద సక్సెస్ ఊర్వశికి చాలా ఇంపార్టెంట్. స్వతహాగా రిచ్ ఐటంగర్ల్ అయిన ఊర్వశి రెమ్యునరేషన్ కంటే పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటోంది. వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని అంటిపెట్టుకునే వుంది. స్టేజ్ మీద స్పేస్ లేకపోయినా తీసుకుని మరీ చిరంజీవి పక్కకు చేరింది.
ఈ అమ్మడిని స్టేజ్‌పైకి పిలవడం ఆలస్యం.. దూసుకెళ్లిపోయి హీరో పక్కనే నుంచుంటూ.. కెమెరా ఫ్రేమ్‌లో కనిపించాలనుకుంటోంది. బ్రోలో నటించిన హీరోయిన్స్ కేతిక శర్మ, ప్రియా వారియర్ సినిమా ఫంక్షన్‌లో మూలన నుంచుంటే.. ఈ అమ్మడు మాత్రం తనే మెయిన్ హీరోయిన్ అన్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్కంద ఐటంసాంగ్ సోమవారం రిలీజైంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. రమ్యబెహర్.. హేమచంద్ర.. మహా ఆలపించారు. ఊర్వశికి మరిన్ని ఆఫర్స్ రావాలంటే స్కంద హిట్ చాలా అవసరం. లేదంటే.. ఫేడౌట్ ఐటంగర్ల్‌గా మిగిలిపోతుంది.