Pawan Kalyan: సీఎం పవన్.. పొరపాటు ఎక్కడ..?
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా.. పవన్‌ని సీఎం అనుకుని అలా సంబోధిస్తూ తను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఇక్కడ పవన్ మీద కోపంతో రగిలిపోయే రాజకీయ ప్రత్యర్ధులు, లేదంటే యాంటీ ఫ్యాన్స్ ఊర్వశీ రౌతేలా మీద కామెంట్ల దాడి పెంచారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడు. ఆయన్ని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా సీఎంని చేసేసింది. దీంతో పవన్ యాంటీ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మని ట్రోల్ చేస్తున్నారు.శం.. పవన్‌ని సీఎం అనుకుని అలా సంబోధిస్తూ తను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఇక్కడ పవన్ మీద కోపంతో రగిలిపోయే రాజకీయ ప్రత్యర్ధులు, లేదంటే యాంటీ ఫ్యాన్స్ ఊర్వశీ రౌతేలా మీద కామెంట్ల దాడి పెంచారు.
కాని అసలు సంగతేంటంటే, ఊర్వశీ రౌతేలా అలా పవన్‌ని సీఎం అనుకోవటానికి రెండు కారణాలున్నాయట. ఒకటి బ్రో ప్రి రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ అంతా పవన్‌ని సీఎం సీఎం అంటూ అరవటం. దీంతో ఊర్వశీ కూడా పవన్ సీఎం అనుకుందట. ఇక రెండో కారణం ఊర్వశీ రౌతేలాకి టెంపరరీ మేనేజర్ కమ్ పీఆర్‌గా ఉన్న వ్యక్తికి హిందీ సరిగా రాకపోవటం. దీంతో పవన్‌ని ఏపీకి కాబోయే సీఎం అని చెప్పబోయి ఏపీ సీఎం అని చెప్పటం జరిగిందట. దీంతో పాపం గ్లామర్ తప్ప జనరల్ నాలెడ్జ్ లేని ఊర్వశి పవన్‌ని సీఎంగా సంబోధించిందట. ఇది ఇండస్ట్రీ సర్కిల్లో సర్కులేట్ అవుతున్న సంగతి.