Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ను సీఎం చేసిన బ్యూటీ.. ట్వీట్ వైరల్

రీసెంట్‌గా నిర్వహించిన బ్రో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఊర్వశి కూడా వచ్చింది. ఈవెంట్‌ తరువాత స్టేజ్‌మీద పవన్‌తో ఉన్న ఫొటోను తాజాగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. చేస్తే చేసింది కానీ ఆమె పెట్టిన కాప్షన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 28, 2023 | 01:29 PMLast Updated on: Jul 28, 2023 | 1:29 PM

Urvashi Rautela Calls Pawan Kalyan Chief Minister Of Andhra Pradesh

Pawan Kalyan: పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ కనిపిస్తే చాలు.. పొలిటికల్‌ మీటింగా, మూవీ ఫంక్షనా అని చూడకుండా సీఎం సీఎం అని అరుస్తుంటారు ఫ్యాన్స్‌. అలా అరవొద్దని పవన్‌తో సహా ఎంతమంది చెప్పినా ఫ్యాన్స్‌ మారడంలేదు. మారరు కూడా.. ఎందుకంటే వాళ్లు ఫ్యాన్స్‌.

వాళ్లకు ఎమోషన్స్‌ తప్ప లాజిక్స్‌ ఉండవు. వినడానికి బానే ఉంటుంది కానీ ఫ్యాన్స్‌ చేసిన ఈ అల్లరి ఓ హాట్‌ బ్యూటీని కన్ఫ్యూజ్‌ చేసింది. ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ను సీఎం చేసింది. సాయిధరమ్‌ తేజ్‌, పవన్‌ కళ్యాణ్‌ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో హాట్‌ బ్యూటీ ఊర్వవి రౌతేలా ఓ ఐటెం సాంగ్‌ చేసింది. రీసెంట్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఊర్వశి కూడా వచ్చింది. ఈవెంట్‌ తరువాత స్టేజ్‌మీద పవన్‌తో ఉన్న ఫొటోను తాజాగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. చేస్తే చేసింది కానీ ఆమె పెట్టిన కాప్షన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో స్టేజ్‌ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేసింది ఊర్వశి. దీంతో పవన్‌ ఎప్పుడు సీఎం అయ్యాడంటు షాకవుతున్నారు నెటిజన్లు.

పవన్‌ కనిపించగానే అంతా సీఎం సీఎం అని అరుస్తుంటే ఊర్వశి పాప నిజమే అనుకుంది కావొచ్చు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం వైసీపీ వాళ్లకు కావాలనే కౌంటర్‌ ఇచ్చింది అంటున్నారు. పిచ్చి కాకపోతే పనిగట్టుకుని వైసీపీ వాళ్లకు కౌంటర్‌ ఇవ్వాల్సిన అవసరం ఊర్వశికి ఏముంటుంది చెప్పండి. ఫ్యాన్స్‌ అల్లరి, పవన్‌ కళ్యాణ్‌ రాయల్టీ చూసి నిజంగానే ఆయన సీఎం అనుకుని కన్ఫ్యూజ్‌ అయ్యింటుంది పాపం ఊర్వశి.