NTR Urvashi : ఎన్టీఆర్‌తో ఊర్వశీ రౌతేలా సెల్ఫీ…

ప్రస్తుతం వార్ 2 (War 2) షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాడు ఎన్టీఆర్ (NTR). దీంతో ముంబైకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 10:01 AMLast Updated on: Apr 16, 2024 | 10:01 AM

Urvashi Rautela Selfie With Ntr

ప్రస్తుతం వార్ 2 (War 2) షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాడు ఎన్టీఆర్ (NTR). దీంతో ముంబైకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) పోస్ట్ చేసిన సెల్ఫీ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది

మెగాస్టార్ (Megastar, Chiranjeevi) వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతేలా.. అక్కడి నుంచి పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం బాలయ్య NBK109 చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు ఫ్యూచర్లో ఎన్టీఆర్‌తో కూడా నటిస్తానని చెబుతూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

యంగ్ టైగర్ (Tiger NTR) ఎన్టీఆర్‌తో కలిసి జిమ్‌లో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా.. గ్లోబల్ సూపర్‌స్టార్ అంటూ రాసుకొచ్చింది. ‘జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) మా ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్‌ స్టార్.. క్రమశిక్షణ, నిజాయితీ, వినయంతో మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి రెడీ.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ ఫోటో స్పెషాల్టీ ఏంటంటే.. ఎన్టీఆర్ టీనేజ్‌లో ఉన్నట్టుగా, చాలా క్యూట్‌గా కనిపించడం. అందుకోసం.. ఊర్వశీ ఫేస్ ఫిల్టర్‌ను వాడినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.