Ustaad Bhagat Singh: గ్లింప్స్ కాదు బాబోయ్.. పూనకాలు.. రెడీ చేసుకోండ్రా అబ్బాయిలు!
ఈ సారి అభిమానుల ఆకలి తీర్చేలా.. అంచనాలు పెంచేలా అనిపించింది, కనిపించింది.. ఉస్తాద్ భగత్‌సింగ్ ఫస్ట్ గ్లింప్స్. పవన్ పోలీసు యూనిఫాం వేసుకుంటే.. బాక్సాఫీస్ కూడా భయపడుతుంది. ఇప్పుడు అదే జరగడం ఖాయం అనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా ఉంది.

Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్‌ను స్క్రీన్ మీద కళ్లనిండా చూసి ఎన్ని రోజులయిందో! భీమ్లానాయక్ వచ్చి ఏడాదిన్నర అవుతోంది అటుఇటుగా! సినిమా షూటింగ్‌లకే పవన్ ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నా.. ఒక్క సినిమా కూడా విడుదలకు రెడీగా లేదు. దీంతో ఫ్యాన్స్ అంతా అప్‌డేట్.. అప్‌డేట్ ప్లీజ్ అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు.
ఈ సారి అభిమానుల ఆకలి తీర్చేలా.. అంచనాలు పెంచేలా అనిపించింది, కనిపించింది.. ఉస్తాద్ భగత్‌సింగ్ ఫస్ట్ గ్లింప్స్. పవన్ పోలీసు యూనిఫాం వేసుకుంటే.. బాక్సాఫీస్ కూడా భయపడుతుంది. ఇప్పుడు అదే జరగడం ఖాయం అనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా ఉంది. గబ్బర్‌సింగ్‌లాంటి భారీ హిట్ ఇచ్చిన కాంబో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్లింప్స్‌లో పవన్‌ను చూసి.. ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఊర మాస్ లుక్‌లో పవన్ అదరగొట్టేశాడు. ఏ కాలమున ధర్మముకు హాని కలుగునో.. అధర్మం వృద్ధినొందునో.. ఆయా సమయం నందు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్న అంటూ ఘంటశాల వాయిస్ ఓవర్ వస్తుంటే.. భగత్.. భగత్ సింగ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
గబ్బర్ సింగ్‌లో క్లాస్‌గా కనిపించిన పవన్.. ఈసారి మాస్ లుక్‌లో చింపేశాడు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్ చివర్లో చెప్పిన డైలాగ్ అయితే కేక పుట్టించింది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో.. పూజా హెగ్డే హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏమైనా గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేసింది. మరో రికార్డ్ బ్రేకింగ్ మూవీ.. పవన్ ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.