Ustaad Bhagat Singh: గ్లింప్స్ అదుర్స్.. కాని హరీష్ శంకర్ ఓవరాక్షన్‌తో కష్టాలు
సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఎంత వైరలైందో, హరీష్ శంకర్ మీద ట్రోలింగ్ అందుకు రివర్స్‌లో వైరలైంది. ఒకటే కారణం.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ 3 రోజులే షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఆ ఫుటేజ్‌తోనే ఈ గ్లింప్స్ రెడీ చేశాడు హరీష్ శంకర్.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ పేలింది. పవన్ స్వాగ్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఓవరాక్షన్ డైరెక్టర్‌గా మళ్లీ వార్తల్లోకెక్కాడు. కారణం తనలోని ఫ్రస్ట్రేషనే అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఎంత వైరలైందో, హరీష్ శంకర్ మీద ట్రోలింగ్ అందుకు రివర్స్‌లో వైరలైంది.
దీనికి ఒకటే కారణం.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ 3 రోజులే షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఆ ఫుటేజ్‌తోనే ఈ గ్లింప్స్ రెడీ చేశాడు హరీష్ శంకర్. ఒక్కొక్కరు 80 శాతం షూటింగ్ పూర్తైనా చిన్న వీడియో కూడ బయటికి వదలట్లేదు. కాని ఉస్తాద్ భగత్ సింగ్ 3 రోజులు ఫుటేజ్‌తోనే గ్లింప్స్ వదిలాడు హరీష్. దీని వెనక భారీ లెక్కలే ఉన్నాయట. గద్దల కొండ గణేష్ తర్వాత ఇన్నేళ్లుగా హరీష్ మరో మూవీ చేయలేదు. పవన్ డేట్లిచ్చినా తను కథతో ఇంప్రెస్ చేయకపోవటం, మధ్యలో పవన్ మరికొన్ని సినిమాలు చేయటం, చివరగా తేరీ రీమేక్ ఛాన్స్ హరీష్‌కి చిక్కటం. ఇలా చాలా జరిగాయి. అంతవరకు బాగానే ఉంది.
కానీ, 3 రోజుల షూటింగ్ తాలూకు ఫుటేజ్‌తో గ్లింప్స్ వదిలి, ఆపేదెవరు అంటూ భారీ స్టేట్ మెంట్లు ఇవ్వటం మీదే ట్రోలింగ్ పెరుగుతోంది. పవన్ పేరు చెప్పుకుని హరీష్ శంకర్ తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటున్నారు కొందరు నెటిజన్స్. మరోవైపు ఓజీ అప్‌డేట్స్‌తో సుజిత్ రెచ్చిపోతున్నాడు. కుర్రాడు అంత వేగంగా పవన్‌తో సినిమా తీస్తుంటే, సీనియర్‌గా హరీష్ పరువేం కాను.. అందుకే ఇలా 3 రోజుల షూటింగ్ వీడియోతో అతి చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. పవన్ పేరుని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్న హరీష్ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.